మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియాస్ మూవీ 'సైరా నరసింహ రెడ్డి'. ఇప్పటివరకు చిరు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా. మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా భారీ తారాగణంతో సైరా ను నిర్మించాడు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్న..వంటి భారీ స్టార్ కాస్ట్ తో దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ నిర్మించగా అక్టోబర్ 2 న రిలీజైంది.

అయితే సైరా తెలుగులో తప్ప మిగతా భాషల్లో ఫెయిల్ అయింది. కేవలం తెలుగులోనే ఈ సినిమా 120 కోట్లు షేర్ వసూళ్లు చేసింది. అయితే ఎన్నో అంచనాలు మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు వరకే సక్సెస్ అవ్వడంతో రామ్ చరణ్ అండ్ చిరు, కొరటాల శివ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టారు. దాంతో కొరటాల కూడా ప్రెజర్ తీసుకోక తప్పడం లేదట. సైరా అనుకున్నట్టుగా సక్సెస్ అయ్యి కలెక్షన్స్ భారీగా వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. చిరు 152 ని భారీ బడ్జెట్ తోనే నిర్మించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మొత్తం మారిపోయాయి. 

భారీ పెట్టుబడి పెట్టి తీసిన సైరాకు సరైన ప్రాఫిట్స్ రాకపోవడంతో కొరటాల సినిమా బడ్జెట్ కంట్రోలింగ్ చేయక తప్పదని.. సైరాతో వచ్చిన నష్టాలు ఈ సినిమాతో పూడ్చాల్సిందే అని చరణ్ టీం భావిస్తున్నారట. చిరు రీఎంట్రీ మూవీ ఖైదీ నెం 150 మాదిరిగానే కొరటాల సినిమా కూడా తక్కువ బడ్జెట్ తో అంటే 25 కోట్లతోనే(రెమ్యూనరేషన్స్ కాకుండా) పూర్తి చేయాలనీ చూస్తున్నారని తాజా సమాచారం. ఇలా బడ్జెట్ కంట్రోల్ లో సినిమాని తీస్తే ప్రాఫిట్స్ బాగా వచ్చే ఛాన్స్ ఉందని దాంతో సైరా తో వచ్చిన నష్టాలను తీర్చుకోవచ్చని పక్కాగా ప్లాన్స్ వేసుకుంటున్నారట.

అందుకు తగ్గట్టుగానే షూటింగ్ షెడ్యూల్స్, పబ్లిసిటి, రిలీజ్ ప్లాన్స్ అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమా నవంబర్ నుండి షూటింగ్ మొదలవనుంది. త్రిష ను హీరోయిన్ గా ఎంచుకునే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే 2020 ఆగష్టులో చిరు 152 ని రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: