వెండి తెరపై కనిపించాలని ప్రతి ఒక్క ఔత్సాహిక కళాకారుడు అనుకుంటారు..కానీ ఎవరో కొద్ది మందిమాత్రమే ఆ అదృష్టాన్ని దక్కించుకుంటారు.  బుల్లితెర, వెండి తెరపై కనిపించడంతో వారు సెలబ్రెటీలుగా మారుతుంటారు. ఇక తెరపై కనిపించి కనువిందు చేసేవారి రియల్ లైఫ్ లో ఎన్నో కష్టాలు..కన్నీళ్లు ఉంటాయని ఎన్నో ఇంటర్వ్యూలో చదివాం.  తాజాగా V6 ఛానల్ లో తీన్మార్ న్యూస్ ద్వారా బిత్తిరి సత్తిగా పరిచయం అయ్యారు కావాలి రవి. ఈ ప్రోగ్రామ్ లో బిత్తిరి సత్తిగా అమాయకంగా మాట్లాడటం..వార్తలు చెప్పడం, కామెడీ చేయడం..రక రకాల గెటప్స్ లో కనిపించడంతో బాగా పాపులర్ అయ్యాడు.

బిత్తిరి సత్తిగా ఓ వైపు కొనసాగుతూనే వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమై అందరి అభిమానాన్ని చూరగొంటున్న బిత్తిరి సత్తి హీరోగా ‘తుపాకి రాముడు’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టీ ప్రభాకర్ దర్శకత్వం వహించగా..రసమయి బాలకిషన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా బిత్తిరి సత్తి ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన సంఘటనలు గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి కూడా నాకు నటన అంటే ఇష్టం.

తెరపై కనిపించాలనే ఉద్దేశంతో నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను.  చిన్నతనం నుంచి సినిమా యాక్టర్లను వాయిస్ అనుకరించడం..వారిలా నటించడం చేయడంతో నువు సినిమాల్లో బాగా పనికివస్తావురా అనేవారు. దాంతో సినిమాలపై ఎక్కువ మోజు పెంచుకున్నానని అన్నారు. ఈ నేపథ్యంలో మొదట సెట్ బాయ్ గా పనిచేశాను. డబ్బింగ్ ఆర్టిస్ట్ గానైనా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో, అక్కడివాళ్లు చెప్పిన పనులన్నీ చేసేవాడిని. ఆ పనులపై తిరుగుతూ ప్రమాదాలకు గురైన సందర్భాలు లేకపోలేదు.

ఒక్కోసారి నేను ఆఫీస్ కి వెళ్లగానే..అబ్బో వచ్చాడురా..టిఫిన్, బోజనాలు తయారు చేయండి తేరగా తింటాడని ఘోరంగా అవమానించేవరని అన్నారు. వమానాలు ఎదురైనా, ఎదురు మాట్లాడితే అవకాశాలు ఇవ్వరనే భయంతో మౌనంగా ఉండిపోయేవాడిని. చిన్నవేషంలో ముందు వరుసలో కనిపించడం కూడా కష్టమయ్యేది. నాకు అనుకున్న పాత్ర మద్యలో ఎవరో వచ్చి ఎగరేసుకు పోయేవారు..దాంతో ఆరోజంతా బాధపడేవాడిని అన్నారు.  ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నాకు ఎంతో బాధ కలిగేది...కొన్ని సార్లు కన్నీళ్లు పెట్టుకున్నాను. ఇలా ఈ స్థాయికి చేరుకోవడానికి నేను పడిన కష్టాలు అన్నీ ఇన్నీకావు అని తన ఆవేదన చెప్పుకున్నాడు బిత్తిరి సత్తి. 


మరింత సమాచారం తెలుసుకోండి: