ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ.. కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో 105వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం బాలయ్య పూర్తిగా మేకోవర్ అయి సరికొత్తగా మారిపోయాడు. ఇప్పటికే దసరా సందర్భంగా ఈ సినిమా లుక్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా దీపావళి కానుకగా మరో అప్టేట్ ఇవ్వనున్నట్టు సమాచారం.ఆలాగే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కాగా తాజాగా ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కి సంబంధించి చిత్రబృందం అప్ డేట్ ఇచ్చింది. ఈ నెల 26న మధ్యాహ్నం 2 గంటల 50 నిముషాలకు సినిమా టైటిల్ ను మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా పోస్టర్ ను విడుదల చేశారు.


అయితే ఈ చిత్రానికి ‘రూలర్’ అనే టైటిల్ నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. మరి అదే టైటిల్ ను ప్రకటిస్తారా లేక కొత్త టైటిల్ ను ఎనౌన్స్ చేస్తారా అనేది చూడాలి. `జైసింహా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత కె.ఎస్‌.రవికుమార్‌ – బాలయ్య హిట్ కాంబినేష‌న్‌ లో రూపొందుతోన్న ఈ సినిమాలో బాల‌కృష్ణ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌న‌ప‌డనున్నారు.


ఇక ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌ పై సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక మ‌రి మ‌ళ్ళీ ఈ చిత్రంతో బాల‌య్య తిరిగి పుంజుకుంటారా ఆయ‌న్ని ఒక కొత్త లుక్‌లో చూడొచ్చ‌ని ఆయ‌న ఫ్యాన్స్ అంతా ఎంతో ఆత్రుత‌తో ఈ చిత్రం కోసం వెయిట్ చేస్తున్నారు. బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్. ఆ తర్వాత గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: