కోలీవుడ్ లో రీసెంట్ గా రిలీజై సంచలన విజయం అందుకున్న సినిమా అసురన్ వెట్రిమారన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో ధనుష్ అదరగొట్టే పర్ఫార్మెన్స్ చేసినట్టు తెలుస్తుంది. సినిమా రిలీజై 100 కోట్లు గ్రాస్ దాటేసిందని ట్రేడ్ రిపోర్ట్. అయితే తమిళంలో హిట్టైన ప్రతి సినిమాకు తెలుగులో మంచి గిరాకి ఉంటుంది.


ఈ క్రమంలో తమిళ అసురన్ మీద తెలుగు హీరోల కన్ను పడ్డది. రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రాం చరణ్ అసురన్ చూసి ఆ రీమేక్ లో తను నటించడానికి సై అన్నాడని వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా చరణ్ ప్లేస్ లో వెంకటేష్ ఈ మూవీ రీమేక్ చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. సురేష్ ప్రొడక్షన్స్ వారు అసురన్ రీమేక్ చేసే అవకాశం ఉందట.


తమిళ నిర్మాత కళైపులి ఎస్ థానుతో కలిసి తెలుగులో ఈ మూవీ రీమేక్ చేస్తారని తెలుస్తుంది. ధనుష్ పాత్రలో వెంకటేష్ తప్పకుండా ఆ అంచనాలను అందుకుంటుందని చెప్పొచ్చు. మాత్రుక దర్శకుడు వెట్రిమారన్ తెలుగు రీమేక్ ను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. మరి వెంకటేష్ వెట్రిమారన్ అసురన్ రీమేక్ ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.


ఈ ఇయర్ మొదట్లో ఎఫ్-2 హిట్ అందుకున్న వెంకటేష్ ప్రస్తుతం నాగ చైతన్యతో వెంకీమామ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అసలైతే ఈ డిసెంబర్ లో రిలీజ్ కావాల్సి ఉన్నా 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా తరుణ్ భాస్కర్ డైరక్షన్ లో వెంకటేష్ సినిమా ఒకటి ఉంటుందని తెలుస్తుంది. మరి అసురన్ రీమేక్ పై అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ కోసం దగ్గుబాటి ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: