టాలీవుడ్ లోకి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్.  మొదటి సినిమా గంగోత్రి పెద్దగా హిట్ కాకపోయినా..తర్వాత దేశముదురు, బన్ని, ఆర్య ఇలా వరుస హిట్స్ తో దుమ్మురేపాడు.  స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎప్పుడూ తన డ్యాన్స్ లో ఎంతో ఎనర్జీ, కొత్తదనం చూపిస్తుంటారు.  ఇక టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

మాటల రచయితగా కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోలతో సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు.  త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ బ్లాక్ బస్టర్ అయ్యాయి.  తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మరోసారి సినిమా వస్తున్న విషయం తెలిసిందే.  త్రివిక్రమ్ తన టైటిల్స్ ఎంతో వైవిధ్యంగా ఉండేలా చూస్తుంటారు.

ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘అలా వైకుంఠపురములో’ సినిమా తెరకెక్కుతుంది. ఆ మద్య ‘సామజవరగమనా’ సాంగ్ తో యూట్యూబ్ లో హల్ చల్ చేశారు.  తాజాగా రెండో పాట 'రాములో రాముల' టీజర్ ని వదిలారు. ఈ పాట లిరిక్స్‌ ను శ్యామ్ రాయగా.. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. ముప్పై సెకన్లు కూడా లేని ఈ పాట దుమ్మురేపుతుంది. 

పాట చిత్రీకరణ, మ్యూజిక్ చూస్తుంటే థియేటర్లో విజిల్స్ తో మార్మోగేలా కనిపిస్తుంది.  ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్‌ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.  అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు.  తాజాగా రిలీజ్ అయిన ఈ వీడియో సాంగ్ అప్పుడే సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: