సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ పెద్దకుమారుడు దగ్గుబాటి రానా తెలుగులోనే కాక హిందీ లో కూడా మంచి గుర్తింపు సాధించారు అక్కడ అతనికి చాలా మంది మిత్రులు ఉన్న విషయం అందరికీ తెలిసినదే ఈమధ్య చాలా రోజులు గ్యాప్ తీసుకొని అమెరికాకు వెళ్లి తన ఆరోగ్య సమస్యల్ని పరుచుకుంటున్న టు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాటలు.

రానా కేవలం తెలుగులోనే కాదు.. మనోడికి ముంబైలో కూడా మస్త్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ హీరో హీరోయిన్లకు రానా జిగిరి దోస్త్ కూడా. అందుకే రానా టాలీవుడ్ టూ బాలీవుడ్ ఫేమస్. అసలు బాహుబలి తొలిభాగం బాలీవుడ్‌లో అంత పెద్ద విజయం సాధించడానికి రానాకు ఉన్న పరిచయాలే కారణం. ఆయనే సినిమా రేంజ్ మార్చేసాడు. ఇక ఇప్పుడు మరోసారి రానా ఫాలోయింగ్ బయటపడింది.

ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే మన రానాతో గిల్లికజ్జాలు ఆడింది.కెమెరా ముందే ఈ ఇద్దరూ తమ స్నేహం చూపించారు. అసలు వాళ్ల ఆటలు చూసిన తర్వాత రానాతో దీపిక ఎంత క్లోజ్ ఉందనేది అర్థమవుతుంది. తాజాగా ఈ ఇద్దరూ ఓ అవార్డ్ వేడుకకు హాజరయ్యారు. అక్కడ దీపిక పదుకొనే ఎప్పట్లాగే కెమెరాలకు పోజులిస్తుంది. మధ్యలో కొందరు వచ్చి ఈమెతో ఫోటోలు కూడా దిగుతున్నారు. అప్పుడే రానా దగ్గుబాటి కూడా అక్కడికి వచ్చాడు

.అతడు వచ్చింది చూసి దీపిక కూడా వెళ్లి మాట్లాడింది.. మాట్లాడటమే కాకుండా ఫోటో దిగాలని లాక్కొచ్చింది. రానా అటూ ఇటూ పరుగులు తీస్తుంటే చేతులు పట్టుకుని లాక్కొచ్చింది ఈ బ్యూటీ. అంతేకాదు.. ఫోటోలకు పోజులిస్తున్న సమయంలో రానా ఏదో జోక్ చేస్తే అతడి పొట్టలో గిల్లి డాన్సులు చేసింది దీపిక. మొత్తానికి ఈ ఇద్దరి క్లోజ్ నెస్ చూసి రానాకు బాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ ఏంటో మరోసారి బయటపడింది. టాలీవుడ్ హీరోల్లో ఎవరికీ లేని గుర్తింపు ముంబైలో రానా దగ్గుబాటి సొంతం.


మరింత సమాచారం తెలుసుకోండి: