తెలుగు టెలివిజన్ లో  బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3. టాలీవుడ్ మన్మథుడు నాగర్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్  తెలుగు సీజన్ 3 షో చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికీ 14 వారాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్  తెలుగు సీజన్ 2 షో.... 15వ వారం లోకి అడుగుపెట్టింది. 16 మంది కంటెస్టెంట్స్ తో ఈ షో మొదలవ్వగా  ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్స్ తో కొనసాగుతోంది. మరికొద్ది రోజుల్లో ముగింపు దశకు చేరుకుంటుండడంతో  ఈ ఆరుగురులో  బిగ్ బాస్ విన్నర్ గా ఎవరిని నిలుస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో ఉండడానికి  టాస్కుల్లో  అదరగొట్టి 100% ఎఫర్ట్ పెడుతున్నారు హౌస్ లోని సభ్యులు . 

 

 

 

 అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రియాల్టీ షో ముగింపు పలకడానికి ఇంకో వారం రోజులు మాత్రమే ఉండడంతో అంతా ఆసక్తిగా మారింది. మరో వారం రోజుల్లో బిగ్ బాస్ విజేత ఎవరో తెలిసిపోతుంది  ఇప్పటికే రాహుల్ తో  పాటుగా భాస్కర్ గ్రాండ్ ఫినాలే టికెట్ గెలిచారు. అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియ లో శ్రీముఖి శివజ్యోతి వరుణ్ సందేశ్ అలీ  రజా  ఉన్నారు. కాగా ఈ వారం హౌస్ నుండి శివజ్యోతి ఎలిమినేట్ అవుతుందని  పెద్ద మొత్తంలో వార్తలు కూడా ప్రచురితమయ్యాయి. బిగ్ బాస్  ఓటింగ్ చూసినా కూడా అదే అర్థమైంది. 

 

 

 

 కానీ తాజాగా ఈ ఎలిమినేషన్ కాస్తా రివర్స్ అయ్యేలా  ఉంది. ఎలిమినేషన్ లో  నిన్నటివరకు శివ జ్యోతి పేరు వినిపించగా... తాజాగా హౌస్ లో రి ఎంట్రీ ఇచ్చిన అలీ రజా  ఇంటి నుండి బయటకు వెళ్తాడు అని  సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు ఆల్రెడీ ఒకసారి ఎలిమినేట్ బయటకు వెళ్లి బయట ఉన్న పరిస్థితులను తెలుసుకుని మళ్లీ రీ ఎంట్రీ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి రావడం... ఇంతకు ముందు అలి  రజా లో ఉన్న జోష్ ఇప్పుడు కనిపించడం లేదని అలీ కి తక్కువ ఓట్లు  వచ్చినట్లు సమాచారం. మరి అలీ రజా  ఎలిమినేట్ అవుతాడు అని వార్తలు నిజమవుతాయా లేదా తెలియాలంటే  మాత్రం నేడు  నాగార్జున  ప్రకటించేంత వరకూ వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: