తెలుగు టెలివిజన్ రంగంలో ఎంతో మంది యాంకర్లు వచ్చారు..పోయారు. కానీ తెలుగు యాంకర్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేలా తన సత్తా చాటారు సుమ కనకాల.  పుట్టింది కేరళాలో అయినా పెరిగింది మాత్రం హైదరాబాద్ కావడంతో తెలుగు పై మంచి స్పష్టత ఉంది. తెలుగు అనర్గలంగా మాట్లాడుతూ..తనదైనా కామెడీ పంచ్ లు వేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది సుమ. కెరీర్ బిగినింగ్ లో బుల్లితెరపై కొన్ని సీరియల్స్ లో నటించింది..ఈ క్రమంలోనే తన సహనటుడు అయిన రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 

ప్రస్తుతం రాజీవ్ కనకాల వెండితెరపై నటిస్తున్నారు.  అప్పుడప్పుడు సుమ కూడా వెండి తెరపై మెరుస్తుంది. బుల్లితెరపై సుమ యాంకరింగ్ అంటే నవ్వలు సందడే అని చెప్పొచ్చు.  ప్రస్తుతం స్టార్ హీరోలు నటించిన సినిమాలకు ప్రీ రిలీజ్ ఫంక్షన్లు సుమనే ఎక్కువగా హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  తాజాగా బిగ్ బాస్ హౌజ్ లో సుమ చేసిన హంగామా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.   తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 మరో వారం రోజుల్లో షో పూర్తి కానుంది. టైటిల్ ఎవరు గెలుచుకోబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతోంది. గత వారం మొత్తం కఠినమైన టాస్క్ లతో షో నడిపించిన బిగ్ బాస్ ఈ వారం ఎంటర్టైనింగ్ షో నడిపించబోతున్నారు. నిన్న ఆదివారం శివజ్యోతి ఎలిమినేషన్ అయిన విషయం తెలిసిందే.

ఇక  కౌంటర్లు, పంచ్ లు వేయడంలో యాంకర్ సుమ తరువాతే... అటువంటి సుమ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే ఎంటర్టైన్మెంట్ మాములుగా ఉంటుందా..?ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో సుమ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక చెవులకు హెడ్ సెట్ పెట్టి వాయిస్ పెంచి సుమ అడుగుతున్న ప్రశ్నలకు ఎవరూ కరెక్ట్ సమాధానం చెప్పలేక పోతున్నారు..చెప్పే ఆన్సర్లు కుడా చాలా ఫన్నీగా ఉన్నాయి. మొత్తానికి ఈ రోజు బిగ్ బాస్ హౌజ్ లో సుమ చేసే సందడి అంతా ఇంతా కాదనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: