తమిళ ప్రజల అభిమాన దివంగత ముఖ్యమంత్రి  అమ్మ  'జయలలిత' జీవితం ఆధారంగా, స్టార్ రైటర్  విజయేంద్ర ప్రసాద్ రాసిన కథాకథనాలతో  తమిళ డైరెక్టర్ 'ఏ ఎల్ విజయ్'  దర్శకత్వంలో  'తలైవి'  అనే టైటిల్ తో  జయలలిత బయోపిక్ ను రూపొందిస్తోన్న  విషయం తెలిసిందే.  అయితే.. ఈ సినిమాలో పలు ఆసక్తికరమైన విషయాలు కూడా ఉంటాయట. ముఖ్యంగా  రాజకీయంగా జయలలిత పై జరిగిన కుట్రలు, అసెంబ్లీలో ఆమె పై జరిగిన దాడుల్లో  అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి పాత్ర ఎంత ఉంది, అలాగే శోభన్ బాబు - జయలలిత మధ్య అనుబంధం పై వచ్చిన రూమర్స్ లో వాస్తవం ఎంత.. లాంటి అంశాలను మొత్తం ఉన్నది ఉన్నట్లుగా విజయేంద్ర ప్రసాద్ తెలుసుకొని రాశారట.  అలాగే జయలలిత - ఎంజీఆర్ మధ్య ప్రేమ,  సాన్నిహిత్యం ఎంత బలమైనదో కూడా ఈ బయోపిక్ లో క్లారిటీగా చూపించనున్నారు. మరి జయలలితకి కుమార్తె ఉందని ఆరోపణలు వచ్చాయి.  మరి ఆ విషయాన్ని కూడా సినిమాలో టచ్ చేస్తారేమో చూడాలి.    

 

 కాగా జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్  కంగనా రనౌత్ నటిస్తోంది. ఇప్పటికే ఈ బయోపిక్  కోసం ప్రత్యేకంగా  తమిళం కూడా నేర్చుకుంటుందట ఈ బాలీవుడ్ క్వీన్. ఇక కంగనా రనౌత్ ను  అచ్చం అమ్మలా మార్చెందుకు  హాలీవుడ్ మూవీ 'డార్కెస్ట్ హవర్'కి మేకప్ మెన్ గా పనిచేసిన  'గ్యారీ ఓల్డ్ మెన్,  'అమ్మ' బయోపిక్  కూడా పని  చేస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమా కోసం  కంగనా  దాదాపు  పది కిలోలు వరకూ  బరువు పెరగుతుందట. ఇక  విజయేంద్ర ప్రసాద్ కథ రాసే ముందు  జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె ఆలోచనా విధానాన్ని కూడా కథలో హైలెట్ చేస్తూ కథ రాశారట. వాటిల్లో  ప్రధానంగా తమిళ  రాజకీయాలను  జయలలిత ఎలా శాసించారు ? ఆ క్రమంలో ఆమె ఎదురుకున్న  సమస్యలు ఏమిటి ? అతి సామాన్యమెన వ్యక్తులకి టికెట్లు ఇచ్చి ఎలా గెలిపించుకోగలిగారు ? లాంటి అంశాలను  ప్రధానంగా తీసుకోని  ఈ స్క్రిప్ట్  రాశారట. మొత్తానికి అమ్మ బయోపిక్ లో  ఆమె జీవితంలోని ఎవ్వరికీ తెలియని విషయాలు కూడా తెలియనున్నాయి.  కాగా  ఈ బయోపిక్ తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా  రిలీజ్ కానుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: