నందమూరి  బాలకృష్ణ హీరోగా  మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో  ఓ సినిమా డిసెంబర్ నుండి మొదలవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే  ఈ చిత్రం  ప్రై ప్రొడక్షన్ కార్య క్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. నవంబర్  మూడో వారం కల్లా   స్క్రిప్ట్ ను  పూర్తి చేసి  త్వరగా షూటింగ్ ను మొదలుపెట్టాలని చూస్తున్నాడు బోయపాటి.  ఇక తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం  ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట. వారిలో ఒక హీరోయిన్ గా కన్నడ బ్యూటీ  శ్రద్ధ శ్రీనాథ్  ను  తీసుకోవాలని దర్శక నిర్మతలు అనుకుంటున్నారు.  ఈ చిత్రాన్ని బాలకృష్ణ తన సొంత బ్యానర్ ఎన్ బి కె ఫిలిమ్స్ నిర్మించనుంది.  అయితే  ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నారని  అందులో ఒక పాత్ర, ముఖ్యమంత్రి పాత్ర అని  గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.   తాజా సమాచారాం ప్రకారం ఈ చిత్రంలో ఎలాంటి  రాజకీయ నేపథ్యం ఉండదట. కేవలం ఈ సినిమా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో  సాగే  పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.  

ఇక  ఈ ఏడాది ప్రారంభంలో బాలయ్య 'కథానాయకుడు'తో, బోయపాటి 'వినయ విధేయ రామ'తో భారీ  డిజాస్టర్ లను చవి చూశారు. మరి బాలయ్య - బోయపాటి  కాంబినేషన్ హిట్  అవుతుందో లేదో చూడాలి. అయితే ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన 'సింహ, లెజెండ్' చిత్రాలు  భారీ విజయాలు సాధించాయి. అలాగే  ఈ సినిమా కూడా హిట్ అయితే,  వీళ్ళు హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే. మరి ప్లాప్ ల్లో ఉన్న ఈ  హిట్ కాంబినేషన్ హిట్ కొడుతుందా ? చూడాలి.   

ఇక ప్రస్తుతం బాలయ్య   కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో హీరోగా  నటిస్తోన్న 105వ చిత్రం రీసెంట్ గా  షూటింగ్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.  ఆలాగే ఈ సినిమా  పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి  'రూలర్' అనే టైటిల్ నిర్ణయించారు.  మరి అదే టైటిల్ ను ప్రకటిస్తారా లేక కొత్త టైటిల్ ను ఎనౌన్స్ చేస్తారా అనేది చూడాలి.  `జైసింహా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత కె.ఎస్‌.రవికుమార్‌ - బాలయ్య  హిట్ కాంబినేష‌న్‌ లో రూపొందుతోన్న  ఈ సినిమాలో బాల‌కృష్ణ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌న‌ప‌డనున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: