సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఇటీవల వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్న తరుణంలో భారీ బడ్జెట్ తో సినిమాలు చేసే డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమాలు నిర్మించడానికి చాలా మంది నిర్మాతలు ఇటీవల శంకర్ చేసిన సినిమాలకు వచ్చిన ఫలితాలు చూసి వెనుకంజ వేస్తున్నారు. ఇటువంటి తరుణంలో గతంలో తాను దర్శకత్వం వహించిన కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు సినిమా అదిరిపోయే రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆ సినిమా సీక్వెల్ అంటూ బ్లాక్ చేసిన డైరెక్టర్ శంకర్ ఎలాగైనా ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టాలని అన్ని విధాలా కృషి చేస్తున్నారు.


శంకర్ దర్శకత్వం వహించిన చివరి విడుదలైన సినిమా 2 పాయింట్ ఓ తీవ్రంగా నిరాశ పరచడంతో భారతీయుడు 2 ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ సక్సెస్ అందుకోవాలని ఈ సినిమాలో భారీ కాస్టింగ్ తో సినిమా రూపొందించాలని పక్కా ప్లానింగ్ తో సినిమాలో కమల్ హాసన్ పక్కన హీరోయిన్స్ గా రకుల్ ప్రీత్ సింగ్ - కాజల్ అగర్వాల్ ని తీసుకోవడం జరిగింది . ఇదే క్రమంలో విలన్ గా అజయ్ దేవగన్ నటించే ఛాన్స్ ఉన్నట్లు ఇప్పటికి రూమర్స్ వస్తూనే ఉన్నాయి.


ఆ సంగతి అటుంచితే ఇప్పుడు మరో విలన్ కోసం శంకర్ వెతుకుతున్నట్లు తెలుస్తోంది. గతంలో అక్షయ్ కుమార్ విలన్ గా సెట్టయినట్లు కథనాలు వెలువడ్డాయి. అలాగే అజయ్ దేవ్ గన్ పేరు కూడా వినిపించింది. ఇకపోతే ప్రస్తుతం సౌత్ నుంచి మరో హీరోని విలన్ గా చూపించేందుకు శంకర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అన్ని బాషల ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేసేలా శంకర్ స్టార్స్ తో హైప్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: