తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాని  విక్టరీ వెంకటేష్ తెలుగులోకి  రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ధనుష్, మంజు వారియర్ జంటగా తెరకెక్కిన  ఈ యాక్షన్ డ్రామాను వెట్రిమారన్ తెరకెక్కించారు. దసరా సెలవుల్లో తమిళనాట విడుదలై సంచలన విజయం సాధించింది.  కాగా ఈ సినిమాని  వెంకటేష్ తెలుగులోకి  రీమేక్ చేస్తున్నా..   స్క్రిప్ట్ లో చాల మార్పులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. రచయిత ఆకుల శివ ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారు.  వెంకటేష్ టైమింగ్ కి తగ్గట్లు కొన్ని కొత్త  సీన్స్ ను ఆకుల శివ రాస్తున్నారు. ముఖ్యంగా  వెంకటేష్ క్యారెక్టర్ సీరియస్ గా సాగిన.. ఆ సీరియస్ నెస్ లో  వెంకటేష్ చేసే యాక్టివిటీస్ తో ఫన్ జనరేట్ అయ్యేలా సీన్స్ రాయమని  సురేష్ బాబు శివని ఆదేశించినట్లు తెలుస్తోంది. మరి ఆకుల శివ ఈ సీరియస్ డ్రామాలో ఏ స్థాయి కామెడి రాస్తాడో.  వెంకటేష్ ఏ రేంజ్ కామెడీ పండిస్తాడో  చూడాలి.   

ఇక ఈ మధ్య కాలంలో కేవలం కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే చేస్తున్న హీరో వెంకటేష్ కి అసురన్ బాగా నచ్చిందట.  కాగా  అసురన్  తెలుగు వర్షన్‌ను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. అతి త్వరలో చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు.  ఇక వెంకటేష్  ప్రస్తుతం  నాగ చైతన్యతో కలిసి నటిస్తున్న  మల్టీస్టారర్ చిత్రం 'వెంకీ మామ'.  కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.  కాగా  జనవరి 11న వెంకీమామ సినిమా  విడుదల కానుంది. ఇంకా అధికారిక ధృవీకరణ  జరగనప్పటికీ, మేకర్స్ ఈ తేదీనే తమ సినిమాని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  

అలాగే వెంకటేష్  ఇప్పటికే దర్శకులు తరుణ్ భాస్కర్, త్రినాథరావ్ నక్కిన ప్రాజెక్ట్స్ ఓకే చేశారు.  వాటిలో ముందుగా తరుణ్ భాస్కర్ సినిమా మొదలవుతుందని ఇటీవలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  అయితే ఈ సినిమా నేపథ్యం కాస్త కొత్తగా ఉండబోతుందట.  హార్స్ రెసింగ్ నెపథ్యంలో ఈ సినిమా సాగుతుందని.. వెంకీ క్యారెక్టర్ చాల కొత్తగా ఉంటుందని  వినికిడి.  ఈ సినిమా చాలా వరకు  రేస్ క్లబ్ లోనే  చిత్రీకరిస్తారట.  మరి ఈ వార్తల్లో ఏమేరకు నిజముందో తెలియాలంటే ఆఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే


మరింత సమాచారం తెలుసుకోండి: