బిగ్ బాస్ రియాలిటీ షో బిగ్ బ్రదర్ అనే షో నుండి దిగుమతి చేసుకున్నది. అయితే హిందీలో ఈ షోకి స్టాండర్డ్ హోస్ట్ గా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నాడు. తమిళంలో మొదటి సీజన్ నుండి కమల్ హాసన్ వ్యవహరిస్తున్నాడు. అయితే తెలుగులో మాత్రం ప్రతీ సీజన్ కి హోస్ట్ మారుతూనే ఉన్నారు. మొదటి సీజన్ కి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించి మంచి మార్కులు సంపాదించాడు. హోస్ట్ గా ఎన్టీఆర్ సూపర్ హిట్.


ఇక రెండవ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించిన నాని కంటెస్టెంట్స్ ని తనకి అనుకూలంగా ఉన్న వాళ్లని తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. అంతే కాదు నాని కొన్ని విషయాల్లో ఒకరినే టార్గెట్ చేస్తూ మాట్లాడారని కామెంట్స్ వచ్చాయి. ఇక మూడవ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున షోని తనదైన శైలిలో చాలా ఈజ్ గా లాగించేశారు. అయితే నాగార్జున బిగ్ బాస్ షోని చూడకుండా ఎక్కువగా రైటర్స్, డైరెక్టర్స్ మీదే ఆధారపడుతున్నారని టాక్ ఉంది.


అలా చేయడ వల్లనే బాబా భాస్కర్ ని ఫేక్ అని చిత్రీకరించాడని, షో చూసి ఉంటే బాబా భాస్కర్ ఏంటో నాగార్జునకి తెలిసేది అని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.అలాగే శ్రీముఖికి అనుకూలంగా వున్న షో డైరెక్టర్లు నాగార్జునతో కూడా ఆమెకి అనుకూలంగా మాట్లాడించారు. ఈ విధంగా తనలోని ఒరిజినాలిటీతో కాకుండా వేరే వాళ్ల మీద డిపెండ్ అవడం వల్ల ఆడియన్స్ పల్స్ పట్టుకోలేకపోయాడు.


అంతే కాదు ఒకానొక దశలో ఏం జరిగిందని కంటెస్టెంట్స్ ని అడగడం వల్ల అసలు ఎపిసోడ్ చూడట్లేదని అర్థం అయిపొయింది. ఇక పోతే పునర్నవి టాపిక్ పదే పదే తీసుకురావడం కూడా చర్చనీయాంశమైంది. అనవసరంగ ఆమెకి అధిక ప్రాధాన్యత ఇచ్చారనే టాక్ కూడా ఉంది. ఇదంతా బిగ్ బాస్ డైరెక్టర్ల సూచనలు పాటించడం వల్లే జరిగిందని అంటున్నారు. దాంతో నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా ఫెయిల్ అయ్యాడని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: