అఖిల్ ఇంకా ఆ డ్రీమ్స్ నుంచి బయటపడలేకపోతున్నాడు. ఒకసారి గట్టి షాక్ తగిలినా.. ఆ కోరికని మాత్రం వదులుకోలేక పోతున్నాడు. స్వయంగా నాగార్జున చెప్పినా సరే, సిసింద్రీ వినిపించుకోవట్లేదట. అఖిల్ రెగ్యులర్ స్టోరీస్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు. ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసేందుకు ఆలోచిస్తుంటాడు. కొంచెం కొత్తగా ఉండే కథలకు సైన్ చేస్తుంటాడు. పైగా ఆస్ట్రేలియాలో చదువుకున్న ఈ అక్కినేని వారసుడిపై హాలీవుడ్ సినిమాల ప్రభావమూ ఎక్కువే అని చెబుతారు. ఈ ఇదిలోన రిస్కీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు అఖిల్. 


తెలుగునాట సూపర్ నేచురల్ పవర్స్ ఉన్న హీరోల కథలు పెద్దగా ఆడలేదు. కానీ అఖిల్ మాత్రం హాలీవుడ్ ప్రభావంతో సూపర్ హీరోస్ సినిమాల్లో నటిస్తున్నాడు. మొదటి సినిమాతోనే పవర్ ఆఫ్ జువా అంటూ విశ్వాన్ని కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ రివర్స్ లో ఈ కథ అఖిల్ ను ముంచేసింది. 


అఖిల్ ఫస్ట్ మూవీ దెబ్బకొట్టడంతో నాగార్జున రంగంలోకి దిగాడు. సిసింద్రీ మాస్, సూపర్ హీరో అని షాక్ తిన్నాడు. ఇప్పుడు కటౌట్ కు తగ్గట్టు లవ్ స్టోరీస్ చేస్తాడని చెప్పాడు. కానీ ఈ హీరో మాత్రం సూపర్ హీరోస్ స్టోరీపై మోజు చంపుకోలేకపోతున్నాడట. అందుకే పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో సూపర్ నేచురల్ పవర్స్ తో ఓ సినిమా చెయ్యబోతున్నాడు అఖిల్. మన్మథుడు నాగార్జున తనయుడిగా అఖిల్ కూడా సోగ్గాడే. చిన్నతనంలోనే సిసింద్రీతో తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నాడు. బుడిబుడి అడుగులతో.. అందరినీ మెస్మరైజ్ చేసే నవ్వుతో.. చిలిపి చేష్టలతో.. మెప్పించాడు. ఇటీవల హీరోగా ఎంట్రీ ఇచ్చి తన నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. కానీ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. డ్యాన్స్ లో ఇరగదీస్తున్నా.. నటనలో ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తున్నా.. మంచి కథ దొరికితే కానీ ఈ అందగాడు హిట్ కొట్టలేడు. తాతకు, తండ్రికి తగ్గ తనయుడిగా నెగ్గుకు రావాలంటే మంచి కథ అయితే ఖచ్చితంగా అవసరంగా ఉంది. 





మరింత సమాచారం తెలుసుకోండి: