సాయిపల్లవి..మన పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. ఆమెలో అందం కంటే నటన పాలు ఎక్కువ. ఈజీ గోయింగ్ గర్ల్ గా ఇట్టే ఆకట్టుకునే సాయిపల్లవిని చూస్తే ఎవరైనా నచ్చుకుంటారు. ఇక కుర్రకారు అయితే లవ్ లోనే పడిపోతారు. ఆమె లాంటి అమ్మాయి కావాలని అంతా కోరుకుంటారు. ఇవన్నీ పక్కనపెడితే సాయిపల్లవి పెళ్ళి మీద ఆ మధ్యన బోల్డ్  స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది. ఈ నేపధ్యంలో ఆమె  లవ్ స్టోరీ ఏంటంటే...


అది రియల్ లవ్ స్టోరీ కాదు, సినిమా స్టోరీ, తనదైన కధలతో  ఆడియన్స్ ని ఎప్పటికపుడు ఫిదా చేసే క్యూటీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ పేరిట కొత్త సినిమా తీస్తున్నారు. ఇందులో సాయిపల్లవికి  జోడీగా రొమంటిక్ ఫ్యామిలీ హీరో అక్కినేని నాగ చైతన్య నటిస్తున్నారు. ఈ ఇద్దరి జంటతో సినిమా మొత్తం లవ్ ని పండిస్తారని అంటున్నారు. ఇప్పటికే ఆనంద్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, హ్యాపీ డేస్, ఫిదా మూవీస్ ద్వారా తన లవ్ ఏంటో చెప్పిన శేఖర్ కమ్ముల కొత్త చిత్రంతో ఇపుడు ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు.


ఈ మూవీలో విశేషం ఏంటి అంటే నాగ చైతన్య తెలంగాణా యాసలో మాట్లాడడం. ఇక ఈ మూవీ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీగానే సాగుతుందని అంటున్నారు. శేఖర్ కమ్ముల మూవీ అనగానే యాస, లోకల్ ఇడెంటిటీ, గ్రామీణ నేపధ్యం. అనుబంధాలు, ఎమోషన్లు అన్నీ కూడా ఈ మూవీలోనే ఉంటాయట. ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న లవ్ స్టోరీ పై భారీ అంచనాలే ఉన్నాయని అంటున్నారు. కొత్త ఏడాది ఈ మూవీ సినిమా థియేటర్లలోకి రానుంది. మరి రచ్చ రచ్చేనని అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: