ప్రస్తుతం అన్ని సినీ పరిశ్రమల్లో ఎక్కువగా బయోపిక్ సినిమాలు వస్తున్నాయి.  అయితే సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన బయోపిక్ లు మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన వారి బయోపిక్ లు కూడా తెరకెక్కిస్తున్నారు.  ఈ నేపథ్యంలో తెలుగు లో అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కధ ఆధారంగా నాగ్ అశ్విన్ ‘మహానటి’ సినిమా తెరకెక్కించారు.  కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.  ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఆయన తండ్రి మహానటులు సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్ బయోపిక్’ లో నటించారు.  కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఎన్టీఆర్ కథనాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. 

కాగా,  ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత విష్ణువర్థన్ ఇందూరి నిర్మించారు.  తాజాగా తమిళుల ఆరాధ్య దైవం..అందరూ ఎంతో ఆప్యాయంగా..గౌరవంగా అమ్మా అని పిలుచుకునే దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ నిర్మిస్తున్నారు. విష్ణు వర్ధన్ నిర్మాణంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఈ బయోపిక్ సినిమా తెరకెక్కుతోంది. ఏఎల్ విజయ్ ఈ సినిమాకి దర్శకుడు. అదేవిధంగా నిత్యామీనన్ ప్రధాన పాత్రలో కూడా జయలలిత బయోపిక్ చిత్రం రూపొందుతోంది.  తాజాగా  జయలలితకు సంబంధించిన ఎలాంటి బయోపిక్ లు రిలీజ్ కావడానికి వీలు లేదని ఆమె మేనకోడలు దీప జయకుమార్ హైకోర్టుని ఆశ్రయించారు.

ఈ మేరకు ఆమె మద్రాసు హైకోర్టులో జయలలిత బయోపిక్ చిత్రాలపై అభ్యంతరం చెబుతూ ఫిటిషన్ దాఖలు చేశారు. ఈ మూవీల కథలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని ఆమె వాదిస్తున్నారు. అలాగే మె పొలిటికల్ లైఫ్ అందరికి తెలిసిన కథే కాబట్టి అభ్యంతరం లేదు. కానీ ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఎలా చూపించబోతున్నారు అనేదే నా ప్రశ్న అని దీప జయకుమార్ అన్నారు. అయితే జయలలిత పర్సనల్ జీవితంపై ఎన్నో రకాల కథనాలు ఉన్నాయి..అలాంటివి లేనివి ఉన్నట్లు చూపిస్తే ఆమె ఇమేజ్ దెబ్బతింటుందని దీప అభిప్రాయపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: