నందమూరి బాలక్రిష్ణ ఎపుడూ వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే ఆయన పబ్లిక్ లోకి వచ్చినపుడు అభిమానుల తాకిడి వల్ల కొన్ని సార్లు చనువుగా కంట్రోల్ చేసే విషయంలో ఒకటి రెండు దెబ్బలు తన ఫ్యాన్స్ ని కొట్టిన సందర్భాలు ఉన్నాయి. వాటిని పెద్దదిగా చూపించి బాలయ్య అలా ఇలా అంటూ రచ్చ చేసిన మీడియా ఉంది. అయితే దానికి కూడా బాలయ్య కౌంటర్ ఇవ్వకపోవడంతో అదే నిజమని భావించే వారు. నిజానికి బాలయ్యకు, ఆయన ఫ్యాన్స్ కి మధ్య అందమైన ఎమోషనల్ బాండేజ్ ఉంది.


ఇదిలా ఉండగా బాలయ్య నిర్మాతల హీరో అంటారు. అలాగే దర్శకుల హీరో అని కూడా పేరు. ఒకసారి స్క్రిప్ట్ ఆయన ఓకే చేస్తే మళ్లీ దాని జోలికి పోరు. సెట్ లో డైరెక్టర్ ఎలా చెబితే అలాగే వింటారు. కొత్త వారు డైరెక్టర్ అయినా కూడా బాలయ్య పూర్తి కోపరేషన్ ఉంటుంది. ఇక నిర్మాతల విషయంలో కూడా బాలయ్య అలాగే ఉంటారు.తన సినిమాల కోసం ఆర్భాటాలు చేయవద్దంటారు. ఎక్కువగా డబ్బు ఖర్చు చేసి నష్టపోవద్దని చెబుతారు.  అటువంటి బాలయ్య మీద ఆసక్తికరమైన రూమర్ ఒకటి వచ్చింది. అదేంటి అంటే ఆయన లేటెస్ట్ మూవీ  రూలర్ కి పన్నెండు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని. నిర్మాతను డిమండ్ చేసి మరీ బాలయ్య ఈ మొత్తాన్ని అడిగారని కూదా న్యూస్ వైరల్ అయింది.


ఇక రూలర్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. డేట్ కూడా రిలీజ్ కి ఫిక్స్ చేశారు. దీంతో కొంచెం తీరికగా ఉన్న నిర్మాత సి కళ్యాణ్ దీని మీద ఫుల్ క్లారిటీ ఇచ్చారు. బాలయ్య రెమ్యునరేషన్ పెంచాలని డిమాండ్ చేసిన వార్త పూర్తిగా అబద్దం అని ఆయన షాకింగ్ రిప్లై ఇచ్చేశారు. బాలయ్యతో ఇంతకు ముందు కూడా తాను పనిచేశానని, ఆయన మంచి వారని, డౌన్ టు  ఎర్త్ ఆయన స్వభావమని కూడా కళ్యాణ్ మెచ్చుకున్నారు. మరి బాలయ్య ముక్కు పిండి రెమ్యునరేషన్ వసూల్ చేస్తున్నడన్న రూమర్లకు ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పడతాయా.. చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: