ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూ మరో పక్క నిర్మాతగా మారిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ స్థాపించి తన తండ్రి చిరంజీవి పాలిటిక్స్ తర్వాత హీరోగా రి- ఎంట్రీ తర్వాత చేసిన రెండు సినిమాలు సూపర్ డూపర్ విజయాలు అందుకొన్నాడు. ఇదే క్రమంలో ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమాని కూడా రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. అంతేకాకుండా కొరటాలతో చిరంజీవి చేయబోయే సినిమాలో చిరంజీవి యంగ్ లుక్ లో ఉండే పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నవంబర్ నెలలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే వేసవికి ఈ సినిమాని విడుదల చేసే ఆలోచనలో నిర్మాత రామ్ చరణ్ మరియు డైరెక్టర్ కొరటాల ఆలోచిస్తున్నట్లు దీనికోసం పక్కా షెడ్యూల్ ఖరారు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి.


అంతేకాకుండా ఈ సినిమాలో త్రిషా హీరోయిన్ గా ఎంపికైనట్లు కూడా సమాచారం. అయితే ఈ సినిమా తర్వాత కొరటాల తో రామ్ చరణ్ సినిమా కూడా ఉండబోతుంది అది కూడా కొణిదెల ప్రొడక్షన్ లోనే చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చిరుతో సినిమా చేస్తున్నాడు కొరటాల.. మరోపక్క రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. చిరు-కొరటాల కాంబినేషన్ లో సినిమా రావడానికి చాలానే టైం పడుతుంది. ఇక అన్నీ కుదిరితే వీరిద్దరితో సినిమా అయిపోయిన తర్వాత ప్రభాస్ తో కొత్త సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది.


ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ప్రభాస్ సినిమాను యూవీ క్రియేషన్ తో పాటు రామ్ చరణ్ కూడా నిర్మించనున్నాడట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంది. కాగా అప్పట్లో సాహో సినిమాని నిర్మించిన నిర్మాతలు యు.వి.క్రియేషన్స్ సంస్ద చెందినవారు నెల్లూరులో నిర్మించిన భారీ మల్టీప్లెక్స్ థియేటర్ ని రామ్ చరణ్ ఓపెనింగ్ చేయడం బట్టి చూస్తుంటే కచ్చితంగా ప్రభాస్ ని హీరోగా పెట్టి యు.వి.క్రియేషన్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ వాళ్లు సినిమా చేయడానికి ఆస్కారం ఉన్నట్టే తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: