బిగ్ బాస్ మూడవ సీజన్ లో మొత్తం పదిహేడు మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి వచ్చారు. ఈ పదిహేడు మందిలో ఐదుగురు ఫైనల్ చేరుకున్నారు. మొదట వచ్చిన పదిహేడు మందిలో ఫైనల్ వరకు చేరుకుంటారని భావించిన వారు కొద్దిరోజుల్లోనే ఎలిమినేట్ అయ్యారు. అలాగే మరికొందరు తాము బిగ్ బాస్ కి వచ్చారా అనేట్టుగా పర్ ఫార్మ్ చేశారు. ప్రేక్షకులని ఏమాత్రం ఎంటర్ టైన్ చేయకుండా నిరాశ పర్చిన వారు కొందరైతే, మరికొందరు ఫైనల్ వరకు చేరకుండా నిరాశ పరిచారు.


మొదటగా హేమ. హేమ సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి పేరు తెచ్చుకుంది. పైర్ బ్రాండ్ గా పేరున్న హేమ బిగ్  బాస్ లో తనదైన మార్క్ ని వేస్తుందని అనుకున్నారు. కానీ అనవసరంగా గొడవలు పెట్టుకుని ప్రేక్షకుల దృష్టి నుండి చాలా దూరం వెళ్ళిపోయింది. దాంతో మొదటి వారమే ఎలిమినేట్ అయ్యింది.  ఇక రెండో వ్యక్తి జాఫర్, జాఫర్ జర్నలిస్టుగా అందరికీ పరిచయమే. జర్నలిస్టు గా ఆయన ముక్కుసూటుగా అడిగే ప్రశ్నలు గెస్ట్ లకి చెమటలు పట్టిస్తాయి. 


అలాంటి జాఫర్ బిగ్ బాస్ లోకి వస్తున్నాడంటే అందరూ ఆయన జర్నీ బిగ్ బాస్ ఎలా ఉంటుందోనని అనుకున్నారు. కానీ ఆయన ప్రొఫెషనల్ జర్నీకి, పర్సనల్ లైఫ్ కి చాలా తేడా ఉందని తెలిసింది. దానివల్ల జాఫర్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. దాంతో రెండవ వారమే ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడవ వ్యక్తి హిమజ. టాప్ ఫైవ్ లో ఉండాల్సిన కంటెస్టెంట్ కాస్త గేమ్ ప్లానింగ్ లో వీక్ అయిపోయి ఎలిమినేట్ అయిపోయింది. 


ఇక చివరగా రోహిణి. రోహిణి హౌస్ లోకి వచ్చిందన్న మాటేగానీ ఆమె హౌస్ లో ఉందా లేదా అన్నట్టుగా ఉండింది. అసలు తన మార్క్ క్రియేట్ చేయడంలో విఫలం అయింది. ఏదో వచ్చామా..వెళ్ళామా అన్నట్టుగానే ఆమె జర్నీ సాగింది. ఈ విధంగా కంటెస్టెంట్లు అభిమానులు పెట్టుకున్న అంచనాలని చేరుకోలేక ప్రేక్షకులని నిరాశ పరిచారు.



మరింత సమాచారం తెలుసుకోండి: