టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ తో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కిస్తున్నారు.  ‘ఆర్ఆర్ఆర్’ గా తెరకెక్కుతున్న ఈ మూవీ మన్యం వీరులపై ఉండబోతుందట.  ఆంధ్రలో బ్రిటీష్ సైన్యానికి ఎదురు తిరిగి మన్యం ప్రజలతో గెరిల్లా యుద్దం ద్వారా పోరాడిన యోధుడు అల్లూరి సీతారామరాజు గా రాంచరణ్. తెలంగాణలో బ్రిటీష్, నైజాం పాలనను వ్యతిరేకించిన మన్యం వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు.  గతంలో ఓ ప్రెస్ మీట్ లో ఈ మూవీలోని పాత్రలు రివీల్ చేశారు రాజమౌళి. 

ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. మిగతా షెడ్యూల్స్ ను చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు చుట్టుముడుతున్నాయి.  ఆ మద్య రాంచరణ్ జిమ్ చేస్తుండగా కాలు బెనికి తీవ్రమైన నొప్పితో నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు.  అంతలోనే ఎన్టీఆర్ చేతికి గాయం కావడంతో ఆయన కూడా రెస్ట్ తీసుకున్నారు. మరికొన్ని కారణాల వలన అనుకున్నంత వేగంగా షూటింగ్ జరగలేదనే టాక్ వుంది.  దాంతో ఈ మూవీ అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా అన్న సందేహంలో పడిపోయారు ఫ్యాన్స్. 

అయితే అలాంటి అవకాశమే లేదంటున్నారు చిత్రయూనిట్. ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరికి ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేయాలని అనుకున్నారట. ఒకవేళ మార్చి నాటికి పూర్తయినా, ముందుగా చెప్పినట్టుగా జూలై 30న ఈ సినిమా విడుదల జరిగిపోతుందని చెబుతున్నారు. ఈ మూవీ మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ మూవీలో బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ నుంచి నటులను తీసుకుంటున్న విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: