టాలీవుడ్ లో ఇడియట్ సినిమాతో మాస్ ఇమేజ్ సంపాదించిన హీరో రవితేజ.. తర్వాత వరుసగా విజయాలు అందుకున్నాడు.  పవర్ తర్వాత కిక్ 2, బెంగాల్ టైగర్ సినిమాలు భారీ డిజాస్టర్ కావడంతో రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు.  అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.  కానీ ఆ తర్వాత వచ్చిన మూడు సినిమాలు వరుసగా డిజాస్టర్ అయ్యాయి. దాంతో తన తదుపరి సినిమా మంచి హిట్ కావాలని చూస్తున్నారు రవితేజ.

మాస్ మహారాజా రవితేజ, వి.ఐ.ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘డిస్కోరాజా’  సైన్స్ ఫిక్షన్ అండ్ పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రవితేజ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.  రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు.ఈ మూవీలో పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్‌ హీరోయిన్లు గా నటిస్తున్నారు. బుధవారం నుంచి రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ షురూ కాబోతోంది. రవితేజ, ఇతర బృందంపై ఫైట్‌ మాస్టర్‌ వెంకట్‌ నేతృత్వంలో పోరాట ఘట్టాల్ని తెరకెక్కించబోతున్నారు. వచ్చే నెల 21 వరకు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరిగే చిత్రీకరణలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్న మూవీ ఇది.

అయితే ఈ మూవీకి 15 నుంచి 17 కోట్లలో  పూర్తిచేయాలని దర్శక నిర్మాతలు అనుకున్నారట. అయితే ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ 22 కోట్లు దాటిపోయినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.  ఇతరత్రా ఖర్చులు చూసుకుంటే 30 కోట్ల వరకూ కావొచ్చని అంటున్నారు. ఈ విషయంపైనే నిర్మాతలు టెన్షన్ పడుతున్నారని చెప్పుకుంటున్నారు.  ఇటీవల విడుదల చేసిన ‘నిను చూసిన క్షణంలో’ పాటకు భారీ స్పందన వస్తుంది. దీపావళి కానుకగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు..దానికి మంచి స్పందన వచ్చింది.

రవితేజ, నభాల కెమిస్ట్రీ బాగున్నట్టు అనిపిస్తుంది. బ్యాగ్రౌండ్‌లో ఎర్రకోట చూపించారు. ఎక్కడా రాజీపడకుండా మూవీ భారీగా షూట్ చేస్తున్నామని, విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉంటాయని మూవీ టీమ్ చెబుతుంది.బాబీ సింహా, వెన్నెల కిషోర్, సత్య, సునీల్, రామ్‌కి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, సంభాషణలు: అబ్బూరి రవి, ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని.


మరింత సమాచారం తెలుసుకోండి: