ఒకప్పుడు మోడల్స్ ఆ తర్వాత క్రికెటర్స్ ఆ తర్వాత బాలీవుడ్ స్టార్స్ మాత్రమే బ్రాండ్ ఫేమస్ ప్రాడెక్ట్స్ కి అంబాసిడర్స్ గా ఉండే వాళ్ళన్న విషయం తెలిసిందే. కానీ రాను రాను ప్లాన్స్, పద్దతులు మారుతున్నాయి. ఏ భాషకు ఆ భాష స్టార్స్ తో బ్రాండింగ్ చేయించేందుకు ఆయా కంపెనీలు భారీగా మొత్తాన్నే సమర్పించుకుంటున్నాయి. టాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్స్ ఎన్నో సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉంటున్న విషయం తెల్సిందే. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధిక బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్న స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అని ఎవరైనా క్షణం ఆలోచించకుండా చెప్పేస్తారు.
 
ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్స్ బ్రాండ్ అంబాసిడర్స్ గా మారిపోతున్నారు. కోల్గెట్ కు చాలామంది క్రికెటర్స్..బాలీవుడ్ స్టార్స్ ప్రమోటర్స్ గా వ్యవహరించారు. తెలుగులో అల్లు అర్జున్.. సమంతలు కూడా అంబాసిడర్స్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తర్వాత సమంత కోల్గెట్ బ్రాండ్ అంబాసిడర్ గా బాగా పాపులర్ అయ్యారు. అయితే సమంత కోల్గెట్ యాక్టివ్ సాల్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించగా ఇప్పుడు నాగచైతన్య ఎంటరయ్యాడు. నాగచైతన్య కోల్గెట్ మ్యాక్స్ ప్రెష్ బ్రాండ్ కు  అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.

అంతేకాదు చైతూ నటించిన యాడ్స్ కూడా అప్పుడే బుల్లి తెరపై సందడి చేస్తూనే ఉన్నాయి. సమంత ప్రమోట్ చేసిన బ్రాండ్ నే ఇప్పుడు సపరేట్ గా చైతూ ప్రమోట్ చేస్తున్నాడు. నాగచైతన్య, సమంతలు కలిసి కూడా ప్రమోట్ చేస్తున్న విషయం తెల్సిందే. సినిమాలతోనే కాకుండా ఈ అక్కినేని జంట ఇలా బ్రాండింగ్ యాడ్స్ తో కూడా కోట్లు వెనకేసుకుంటున్నారంటు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే బ్యూటి ఫుల్ కపుల్స్ ని వెండి తెరపై చూసినా బుల్లి తెరపై చూసినా కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే వీళ్ళు కోట్లు డిమాండ్ చేసినా కూడ అసలు ఆలోచించకుండా ఇవ్వడానికి ఎన్నో కంపెనీలు రెడీ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: