ఇటీవల స్టార్ మా ఛానల్ లో జరిగిన బిగ్ బాస్ రెండు సీజన్స్ కూడా ఎంతో అద్భుతంగా సాగిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఇటువంటి షోలను మన తెలుగు ప్రజలు పెద్దగా ఆదరించరు అనే పుకార్లు మొదట్లో ప్రచారం అయినప్పటికీ, మెల్లగా ఈ షో మన వాళ్లకు ఎంతో చేరువయింది. ఇకపోతే మొదటి రెండు సీజన్స్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు నాచురల్ స్టార్ నాని ఎంతో అద్భుతంగా ముందుకు నడిపించగా, ప్రస్తుతం మూడవ సీజన్ ని యువసామ్రాట్ కింగ్ అక్కినేని నాగార్జున గారు మరింత జోష్ తో ముందుకు తీసుకెళ్తున్నారు. 

ఇప్పటికే చివరి అంకానికి చేరుకున్న ఈ షో, రేపటితో ముగింపు పలకనుంది. ఇక ప్రస్తుతం షోలో శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్, ఆలీ, వరుణ్ సందేశ్ మాత్రమే మిగలడంతో, ఈ ఐదుగురిలో ఎవరు ఫైనల్ విజేతగా మిగులుతారు అనే దానిపై వీక్షకుల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇక అప్పుడే సోషల్ మీడియా మాధ్యమాల్లో పలువురు నెటిజన్లు తమకు నచ్చిన కంటెస్టెంట్స్ పేర్లు చెప్తూ, వారే గెలుస్తారు అంటూ ప్రచారాలు మొదలెట్టేసారు. అయితే షాకింగ్ గా కాసేపటి క్రితం ఈ షో విజేత రాహుల్ అంటూ ఒక సంచలన వార్త బయటకు రావడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఎటువంటి పిక్ లేదా వీడియో వంటివి లేనప్పటికీ, 

రాహుల్ విన్నర్ గా ఎంపికైనట్లు చెప్తున్నారు. ముందుగా బాబా భాస్కర్, ఆలీ, వరుణ్ సందేశ్ షో నుండి బయటకు వెళ్తారని, ఆ తరువాత శ్రీముఖి మరియు రాహుల్ మాత్రమే చివరకు మిగులుతారని, ఇక వారిద్దరి మధ్య జరిగిన టఫ్ ఫైట్ లో హోస్ట్ నాగార్జున గారు ఫైనల్ విన్నర్ గా రాహుల్ ని ప్రకటించినట్లు చెప్తున్నారు. ఒకరోజు ముందే ఈ షో యొక్క విజేత డీటెయిల్స్ బయటకు రావడంతో, కొందరు ఇది నిజమే అంటూ ఒప్పుకుంటున్నప్పటికీ, మరికొందరు మాత్రం వీటిని పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. మరి మరొక్కరోజు మాత్రమే మిగిలి ఉన్న ఈ షోలో ఎవరు విజేతగా నిలిచి టైటిల్ గెలుచుకుంటారో చూడాలి......!!


మరింత సమాచారం తెలుసుకోండి: