సైరా సినిమా అంత కాదు ఇంత కాదు అన్నారు... రిలీజ్ రోజు బాహుబలితో పోల్చారు. తర్వాత తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ మూవీ అన్నారు. చిరు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అన్నారు... చివ‌ర‌కు సైరా ప్లాప్ అంటున్నారు. చివ‌రి మాట నూటికి నూరు శాతం నిజం. ఇంకా చెప్పాలంటే ఫైన‌ల్ బాక్సాఫీస్ ర‌న్ కంప్లీట్ అయ్యే స‌రికి సైరా సినిమాకు 43 కోట్ల 45 లక్షల రూపాయల నష్టం తేలింది.


సైరా వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్‌ను 187 కోట్ల రూపాయలకు అమ్మారు. సినిమా ఫైనల్ రన్ లో 188 కోట్ల రూపాయలు రాబ‌ట్టింది. అంటే టెక్నికల్ గా సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టే. కానీ ఏరియా వైజ్ చూసుకుంటే ఈ సినిమా బయ్యర్లకు నష్టాలు మిగిల్చింది. ఉత్తరాంధ్ర, నైజాం మినహా ఎక్కడా ఈ సినిమా లాభాల బాట పడ్డలేదు. ఇక త‌న తండ్రి కోసం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాను తెర‌కెక్కించిన చ‌ర‌ణ్‌కు భారీ న‌ష్టాలు త‌ప్ప‌లేదు. తండ్రి కోసం ఎంతో క‌ష్ట‌ప‌డిన చ‌ర‌ణ్‌కు చివ‌ర‌గా చిరు భారీ న‌ష్టాలు మిగిల్చాడు. అదే ఈ క‌థ ఏ రాజ‌మౌళీయో తీసి ఉంటే మ‌రోలా ఉండేది.


రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సైరాకు రు.105 కోట్ల షేర్ వ‌చ్చింది. అయితే ఇందులో కూడా నైజాం, వైజాగ్‌లో మాత్రం లాభాలు..అది కూడా స్వ‌ల్పంగానే వ‌చ్చాయి. ఇక మిగిలిన నాలుగు భాష‌లు త‌మిళ్‌, హిందీ, క‌న్న‌డం, కేర‌ళ గురించి మాట్లాడుకోవ‌డానికేం లేదు. అన్ని చోట్లా సైరా డిజాస్ట‌రే అయ్యింది. సైరా ఏపీ, తెలంగాణ ఫైన‌ల్ వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.


నైజాం – 32.10 కోట్లు


సీడెడ్ – 19 కోట్లు


ఉత్తరాంధ్ర – 16.80 కోట్లు


ఈస్ట్ – 8.35 కోట్లు


వెస్ట్ – 6.65 కోట్లు


గుంటూరు – 9.70 కోట్లు


నెల్లూరు – 4.65 కోట్లు


కృష్ణా – 7.70 కోట్లు



మరింత సమాచారం తెలుసుకోండి: