తెలుగులో ప్రసారమయిన బిగ్ బాస్ సీజన్ 3 ఈరోజు మంగలమ్ పాడేసింది. వందరోజుల ప్రయాణం.. 16 మంది సెలెబ్రెటీలు.. రోజుకో ఆట.. జనాలకు వినోదం ఇదంతా చుకున్న మా యాజమాన్యం.. ఇదండీ జరిగింది.. రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ బిగ్గు బిగ్ బాస్ అందరికి కాకపోయినా కొంతమందికి మాత్రమే ఎంటర్టైన్మెంట్ పంచింది. మరి కొందరికి తలా నొప్పి పంచింది. సినిమాలో మేకప్ వేసుకొని రాణించడం ఎవరైనా చేస్తారు.. 

ఇలాంటి రియాలిటీ షో లో వచ్చి గెలిచినోడే మొనగాడు. ఈరోజు బిగ్ బాస్ కథ కంచికి చేరింది. చిన్న సెలెబ్రెటీలు ఈ షోలో సందడి చేశారు. మొదట గొడవలు లేకున్నా రాసుకొని పూసుకున్న సెలెబ్రెటీలు రాను రాను రచ్చబండను చేశారు. మొత్తానికి ఈ రచ్చబండకు న్యాయనిర్ణేతగా రొమాంటిక్ స్టార్ అక్కినేని నాగార్జున వ్యవహరించారు. సినిమా నే గ్రేట్ అని ఒప్పుకున్నాడు కూడా.. 


విషయానికొస్తే.. హొస్లోకి  అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపుగా 14 సార్లు ఎలిమినేషన్ కోసం నామినేట్ లిస్ట్ ఉండి  చివరికి టైటిల్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. కానీ, రాహుల్ చిచ్చా ఈరోజు  నిరూపించారు. మొదటి నుండి ఏదోలా ఎం వస్తాడు అనుకున్న వారంతా ఈరోజు నోటిమీద వేలేసుకున్నారు. రాహుల్ టైటిల్ విన్నర్ అయ్యాడు 50లక్షలు కూడా కొట్టేసాడు. 


చివరి వరకు కూడా శ్రీముఖి వస్తుందని చాలా మంది అనుకున్నారు కానీ చివరకు నిలిచింది మాత్రం రాహుల్.. ఓ సారి ర్యాపర్ నోయల్ చెప్పినట్టుగా కుందేలు తాబేలు కథ మాదిరి.. రాహుల్ మొదటినుండి గేమ్‌ను చాలా నెమ్మదిగా ఆడాడు.. తాబేలు బద్ధకంగానే కనిపిస్తుంది. కాని కుందేలు అక్కడిక్కడికి దూకుతూ చెట్లు ఎక్కుతూ రచ్చ చేస్తుంది. అయితే .. ఈ బిగ్ బాస్ ఆటలో గెలిచింది మాత్రం తాబేలు. వెనక్కి తగ్గింది కుందేలు. ఈ బిగ్ బాస్ సీజన్ 3లో విజయం ఈ తాబేలుదే. కుదేలైన కుందేలు శ్రీముఖి. ఆమె గట్టి పోటీ ఇచ్చి రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకుంది. ముఖ్య అతిధిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవితో  ఓ సెల్ఫీ తీసుకుంది.. ఆడండి ఎక్కడ జరిగిన బిగ్ బాస్ 3 డ్రామా.. బిగ్ బాస్ 4 కి ఎవరొస్తారో చూడాలి మరి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: