టబు అంటే దాదాపు మూడు దశాబ్దాల క్రితం రిలీజ్ అయిన ఆమె తొలి
సినిమా కూలి నంబర్ వన్ గుర్తుకువస్తుంది. కలయా నిజమా అంటూ అందుకో ఓ సాంగ్ లో రొమాంటిక్ భంగిమలతో టబూ నాటి కుర్ర కారు ని ఓ ఆట ఆడుకుంది. అసలు కలల మొత్తాన్నే ఆక్రమించేసింది. ఆ తరువాత అక్కినేని రొమాంటిక్ హీరో
నాగార్జున పక్కన నిన్నే పెళ్ళాడుతాలో పండుగా నటించి యూత్ గుండెలను అలా చిదిమేసింది. ప్రేమదేశంలో ఇద్దరు మిత్రుల మధ్య అందాల పోటీగా నిలిచి కాలేజ్ స్టూడెంట్స్ దిల్ కొల్లగొట్టేసింది. మొత్తానికి టబు అంటే గొప్ప ట్రబుల్ అనిపించేసుకుంది.
ఇకపోతే టబు కాలాపానీ వంటి మూవీస్ చేసి నటిగా సత్తా చాటుకుంది కానీ
టాలీవుడ్ కి వచ్చేసరికి మాత్రం టాబు అందాలా తారగానే చూస్తారు. ఆమె అందం చూస్తూ యువత ఉప్పొంగిపోతారు. ఇపుడు టబు మళ్ళీ తెలుగులో కనిపిస్తోంది. అది కూడా
అల్లు అర్జున్ మూవీ అల వైకుంఠపురంలో మూవీతో. ఈ సినిమాల్లో టబు క్యార్టర్ ఏంటో
డైరెక్టర్ త్రివిక్రం రివీల్ చేయకపోయినా ఆమె అందమైన బొమ్మగా కనిపిస్తుందన్నది మాత్రం అర్ధమైపోతోంది.
టబు పుట్టిన రోజు ఈ రోజు. సో ఈ ఈరోజు అల వైకుంఠపురంలో
పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేశారు. అందులో టబు ఎప్పటికీ తరగని అందాలతో అలరించడమే పెద్ద స్పెషల్ గా చెప్పుకోవాలి. నాలుగు పదుల వయసులో కూడా టబు గ్లామర్ ఎక్కడా చెక్కుచెదరలేదు అనడానికి ఈ
పోస్టర్ ఒక ఉదాహరణ. మరి
పోస్టర్ లోనే ఇలా ఉంటే అల వైకుంఠపురంలో టబు ఏ విధంగా అలరిస్తుందో చూడాల్సిందే. ఏది ఏమైనా మంచి పాత్రలతో ఇప్పటికీ అదరగొడుతున్న టబుకు జన్మదిన శుభాకాంక్షలు.