బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుండి శ్రీముఖి ఫైనల్ వరకు వస్తుందని అనుకున్నారు. అలాగే వచ్చింది కూడా. అయితే టైటిల్ రేసులో రాహుల్ తో గట్టి పోటీ ఇచ్చి, చివరిలో టైటిల్ చేజార్చుకుంది. 
బిగ్ బాస్ టైటిల్ పోరులో గట్టి పోటీ ఇచ్చి చివరి వరకు టైటిల్ గెలుస్తుందేమోనన్న  ఉత్కంఠని కలుగజేసిన శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలుచుకున్నాడు. 


అయితే శ్రీముఖి విన్నర్ కాకపోవడానికి కారణాలేంటని విశ్లేషిస్తే, మొదటగా బిగ్ బాస్ లో గ్రూపులుగా ఉన్నప్పుడు అంత తొందరగా ఎలిమినేట్ అవ్వరు. ఎందుకంటే ఆ గ్రూపులోని సభ్యులు ఆ వ్యక్తిని నామినేట్ చేయరు కాబట్టి ఎలిమినేట్ అవకుండా ఉంటారు. అయితే చివరికొచ్చే కొద్దీ గ్రూపు కాకుండా ఒంటరిగా ఉన్నవాళ్ళే నెగ్గుకువస్తారు. ఈ విషయం బాగా తెలుసుకున్న రాహుల్ మొదట్లో వరుణ్, వితికా బృందంలో ఉండి, తనకంటూ ఫాలోయింగ్ ఏర్పడ్డ తర్వాత ఆ గ్రూప్ నుండి విడివడ్డాడు. 


అపుడు అతను ఒంటరి వాడవడంతో అతన్ని అభిమానించే వారి ఓట్లన్నీ అతనికే పడ్డాయి. కానీ శ్రీముఖి, బాబా భాస్కర్ లు మొదటి నుండి స్నేహంగా ఉంటున్నారు. వీరిద్దరి మధ్య చిన్న చిన్న గ్యాప్ లు వచ్చినప్పటికీ అవేవీ వారి స్నేహాన్ని చెడగొట్టలేవు. ప్రేక్షకుల్లో శ్రీముఖిని ఓట్లేసే వారిలో బాబా భాస్కర్ ని అభిమానించే వారు కూడా ఉన్నారు. దాంతో ఓట్లు చీలిపోయేవి. ఇద్దరినీ ఇష్టపడే కామన్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఓట్లు విపరీతంగా చీలిపోయాయని అర్థం అవుతుంది. 


అయినా కూడా వీరిద్దరు టాప్  ౩ లో ఉన్నారంటే ఆశ్చర్యమే అని చెప్పాలి. వీరిద్దరి ఓట్లు కలిపితే రాహుల్ ఓట్ల కంటే ఖచ్చితంగా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ వీరిద్దరిలో బాబా భాస్కర్ మధ్యలో ఎలిమినేట్ అయితే ఆ ఓట్లన్నీ శ్రీముఖికి పడేవి. అప్పుడు శ్రీముఖి విన్నర్ గా నిలిచేది.


మరింత సమాచారం తెలుసుకోండి: