తెలుగు సంగీత దర్శకులలో దేవిశ్రీ ప్రసాద్ మొన్నటి టాప్ లో ఉంటూ వచ్చాడు. దేవి ఇచ్చే సంగీతం ప్రేక్షకులని అలరించడంతో పాటు సినిమ విజయంలో కీలక పాత్ర వహించేది. కొన్ని సినిమాల్లో కంటెంట్ బాగాలేకపోయినా దేవి సంగీతం వల్లే హిట్ అయ్యాయంటే అతిశయోక్తి కాదేమో. అంతలా తన మ్యూజిక్ తో మ్యాజిక్క్ చేసిన దేవి ప్రస్తుతం వెనకబడ్డాడు. కొట్టిన ట్యూన్లనే కొడుతున్నాడనే ఆరోపణల వల్ల తన సంగీతంలో కొత్తదనం లోపించడంతో రేసులో వెనకబడ్డాడనేది వాస్తవం.


దేవి టాప్ లో ఉన్నన్ని రోజులు తమన్ సంగీత దర్శకుడిగా చాలా సినిమాలు చేసిన్ప్పటికీ అంతగా పేరు రాలేదు. ఎవరైనా దేవి తర్వాతే అన్నట్టుగా ఉండేది వ్యవహారం. పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు చేసినా అంత గుర్తింపు రాలేదు. తమన్ సంగీతంలో మాటలు వినిపించవనే కామెంట్ చాలా రోజులు వినబడింది. అయితే గత కొన్ని రోజులుగా తమన్ సంగీతంలో చాలా మార్పులు వచ్చాయి. తొలిప్రేమ, మహానుభావుడు లాంటి సినిమాలో తమన్ కొత్త రకం సంగీతాన్ని వినిపించాడు.


దాంతో తమన్ కి త్రివిక్రమ్- జూ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన "అరవింద సమేత" సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా ద్వారా తనలోని మరో సంగీత దర్శకుడిని ఆవిష్కరించాడు.  త్రివిక్రమ్ నమ్మకాన్ని చూరగొన్న తమన్.. ఆయన తర్వాతి సినిమా ‘అల వైకుంఠపురములో’లోనూ అవకాశం దక్కించుకున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ పాటలు ఎలా జనాల్ని ఊపేస్తున్నాయో.. సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగిస్తున్నాయో చూస్తున్నాం. 


ఈ రెండు పాటలతో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తమన్ పేరు మార్మోగుతోంది. సామజవరగమనా సాంగ్ విడుదలైన కొన్ని రోజుల్లోనే మిలియన్ల వ్యూస్ సాధించడమే కాకుండా, అత్యధిక లైక్స్ సాధించుకున్న తెలుగు పాటగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ పాట ఒక్కటే సినిమాకి ఎక్కడలేని పాపులారిటీని తీసుకువచ్చింది. దీంతో ప్రస్తుతం తమన్ కి వరుసగా అవకాశాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్న తమన్ మరి కొద్ది రోజుల్లో టాప్ లోకి వెళ్ళిపోవడం ఖాయం అనిపిస్తుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: