బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ ముగిసింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా చేసిన ఈ రియాలిటీ షోలో ఈ సీజన్ విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. టైటిలే కాదు ప్రైజ్ మనీ కూడా సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ కు సర్ ప్రైజ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ అదిరిపోయింది.


నాగార్జున పిలవడంతోనే చిరు ఓకే చెప్పడం బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కు రావడం జరిగింది. అయితే ఫైనల్ ఎపిసోడ్ లో చిరు తనదైన చలోక్తులతో సరదాగా కనిపించారు. బిగ్ బాస్ సీజన్ 3 ముగిసింది. సీజన్ 4 కోసం ఆడియెన్స్ ఎదురుచూసేలా చేశారు. అయితే బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్ ఎవరు..? ఈసారి స్టార్ మా ఎవరిని హోస్ట్ గా ఎవరిని తీసుకొస్తుంది అన్న విషయాల గురించి ఇప్పటినుండే డిస్కషన్స్ జరుగుతున్నాయి.


అయితే కొంతమంది సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్ గా చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తుంది. 60 ఏళ్ల వయసు వచ్చినా సరే కుర్రాళ్లకు ధీటుగా కింగ్ నాగార్జున హోస్ట్ గా అదరగొట్టాడు. బిగ్ బాస్ సీజన్ 1 యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అదరగొట్టగా సీజన్ 2లో నాచురల్ స్టార్ నాని కూడా తన మార్క్ చూపించాడు. ఇక సీజన్ 3లో నాగార్జున హోస్టింగ్ కూడా అద్భుతంగా సాగింది.


ఇక సీజన్ 4 హోస్ట్ గా ఎవరు వస్తారన్న దాని మీద చర్చలు జరుగుతున్నాయి. మీలో ఎవరు కోటిశ్వరుడుతో నాగార్జున తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా ఆ షో హోస్ట్ చేశారు. ఇక ఇప్పుడు నాగార్జున తర్వాత బిగ్ బాస్ 4 హోస్ట్ గా చిరు వస్తాడా లేదా అన్నది చూడాలి. అయితే బిగ్ బాస్ 4 వచ్చే ఏడాది మొదలైనా సమ్మర్ లోనే మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారట బిగ్ బాస్ నిర్వాహకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: