ప్రస్తుతం తెలుగు టెలివిజన్ తెరపై మంచి పేరుతో దూసుకుపోతున్న రష్మీ గౌతమ్, మధ్యలో అక్కడక్కడా కొన్ని సినిమాల్లో కూడా నటించి మంచి పేరు సంపాదించడం జరిగింది. మొదట్లో చిన్న ప్రోగ్రామ్స్ ద్వారా పరిచయమైన రష్మీ, ఆ తరువాత ఈటివిలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా తన ఆకట్టుకునే యాంకరింగ్ టాలెంట్ తో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. ఇక ప్రస్తుతం ఆమెకు యూత్ లో బాగా క్రేజ్ ఉందని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఎంతో రసవత్తరంగా సాగి, రెండు రోజుల క్రితం పూర్తి అయిన బిగ్ బాస్ సీజన్ 3లో మరొక ప్రముఖ యాంకరైన శ్రీముఖి పార్టిసిపేట్ చేసి, ఫైనల్ వరకు చేరి చివరకు రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. 

అయితే రాబోయే సీజన్ 4 ద్వారా రష్మీ కూడా బిగ్ బాస్ షోలో జాయిన్ కాబోతోందని నేడు పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. వాస్తవానికి రష్మీ మరియు మరొక యాంకర్ అనసూయకు ఈ బిగ్ బాస్ లోనే అవకాశం రావడం జరిగిందని, అయితే అప్పటికే వారిద్దరూ కూడా కొన్ని కమిట్మెంట్స్ ఉన్న కారణంగా పార్టిసిపేట్ చేయలేము అని చెప్పినట్లు సమాచారం. అయితే ఈసారి సీజన్లో కూడా అనసూయ పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చని, కానీ రష్మీ మాత్రం తప్పకుండా ఉంటుందని అంటున్నారు. 

ఇప్పటికే రష్మీ తన అందచందాలతో పలు సినిమాలతో మంచి పేరు దక్కించుకోవడంతో, ఆమెను ఖచ్చితంగా ఈ సీజన్లో తీసుకోవాలని బిగ్ బాస్ టీమ్ కూడా గట్టిగా నిర్ణయించిందట. కాగా ఆమె కూడా షోలో పాల్గొనేందకు కొంత సుముఖంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని, ఒకవేళ నిజమే అయితే మాత్రం, రష్మీ ఫ్యాన్స్ కి ఇది పెద్ద పండుగ వార్తే అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: