మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.  ‘నా పేరు సూర్య’ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ని వెండితెరపై ఎప్పుడు చూడాలా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అలా వైకుంఠపురములో’ సినిమాతో ఆ కోరిక తీరబోతుంది.  సంక్రాంతికి ఆ గ్యాప్ ని మర్చిపోయేలా స్ట్రాంగ్ గా ప్లాన్ చేసుకున్నట్లు అర్ధమవుతోంది.  గతంలో ఈ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. 


ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్శకత్వంలో ‘అలా వైకుంఠపురములో’ నటిస్తున్న అల్లు అర్జున్ మరో సూపర్ హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు.  ఈ మూవీలో కూడా ఫాదర్ సెంటిమెండ్ మెండుగా ఉండబోతుందట. అంతే కాదు ఈ మూవీ మ్యూజికల్ హిట్ ఖాయమంటున్నారు.  థమన్ మ్యూజిక్ తో నిజంగా మాయాజాలం చేస్తున్నాడు.  సామజవర గమనా, రాములో రాములా సాంగ్స్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. థమన్ మ్యూజిక్ - త్రివిక్రమ్ మార్క్ ఈ పాటల్లో స్పషంగా కనిపిస్తోంది. ఇప్పటికైతే మాస్ ఆడియెన్స్ తోపాటు చిన్నపిల్లలు ఆల్ మోస్ట్ పాటలకు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఎక్కడ ఎంట్రటైన్ మెంట్ ప్రోగ్రామ్స్ అయినా ఈ పాటలే వినిపిస్తున్నాయి. 

తాజాగా బన్నీ గ్యాంగ్ మారో సాంగ్ ని సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న టాక్ ప్రకారం 'డాడీ డాడీ' అనే సాంగ్ ని నెస్ట్విడుదల చేయబోతున్నారట. స్తుతం థమన్ నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు వెంకీ మామ - డిస్కో రాజా వంటి సినిమాలకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: