బిగ్ బాస్ మూడవ సీజన్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో ఉన్న ఒకే ఒక్క ఫిమేల్ కంటెస్టెంట్ శ్రీముఖి. మొదటి నుండి చివరి వరకు ఒకే రకమైన ఎనర్జీతో ప్రేక్షకులకి వినోదాన్ని పంచింది. ఈ సారి శ్రీముఖి ఖచ్చితంగా టైటిల్ గెలుస్తుందని భావించారు. టైటిల్ గెలిచిన మొదటి ఫిమేల్ కంటెస్టెంట్ గా నిలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ చివరికొచ్చేసరికి రాహుల్ సిప్లిగంజ్ పట్టుకెళ్ళాడు. బిగ్ బాస్ మొదటి సీజన్ నుండి ఇలాగే జరుగుతూ వస్తుంది.


మొదటి సీజన్ లో హరితేజ తనదైన పర్ ఫార్మెన్స్ తో అదరగొట్టింది. సీజన్  లో ఎంటర్ టైన్ పంచిన వారి పేర్లలో మొదటి స్థానంలో నిలుస్తుంది హరితేజ. ఆమె చేసిన బుర్రకథ అయితే నేమి, పాడిన పేరడి పాటలు కానీ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే చివరి వరకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చినా కూడా ఆమెను అదృష్టం వరించలేకపోయింది. చివరిలో శివబాలాజీ టైటిల్ ఎగరేసుకుపోయాడు.


ఇక రెండవ సీజన్ చాలా రసవత్తరంగా సాగింది. ఇంకొంచెం మసాలా అని ఎప్పుడైతే అన్నారో కానీ ఆ సీజన్ మసాలా ఎక్కువైందనే చెప్పాలి. స్టార్టింగ్ నుండి చివరి వరకు ఈ సీజన్ లో మసాలా చాలా ఎక్కువైంది. అయితే ఈ సీజన్ లో ఫిమేల్ కంటెస్టెంట్ అయిన గీతా మాధురి తనదైన మార్కుని క్రియేట్ చేసింది. కంటెస్టెంట్ అందరిలోకి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. గీతా మాధురి బయట ఎలా ఉంటుందో హౌస్ లో కూడా అలానే ఉందని అందరూ మెచ్చుకున్నారు

.
అయితే ఈ సీజన్ లో కూడా ఫిమేల్  కంటెస్టెంట్ నిరాశే ఎదురయింది. కౌషల్ ఆర్మీ వల్ల కౌశల్ విన్నర్ కాగా, గీతా మాధురి రన్నరప్ తో సరిపెట్టుకుంది. కనీసం మూడవ సీజన్ లోనయినా టైటిల్ గెలిచిన  మొదటి ఫిమేల్ కంటెస్టెంట్ గా  శ్రీముఖి నిలుస్తుందని అనుకున్నారు. కానీ చివరికి నిరాశే మిగిలింది. మరి బిగ్ బాస్ నాలుగవ సీజన్ లోనయినా  ఫిమేల్ కంటెస్టెంట్ టైటిల్ గెలుస్తారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: