సినిమా షూటింగ్ స్టార్ట్  గాక  ముందే  డిజాస్టర్ అంటూ  ఇటీవల  ప్రచారం  జరిగింది.  ఆసినిమా   ఏదో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అల... వైకుంఠపురములో ...  అయితే ఈ నెగిటివ్ ప్రచారాన్ని  సీరియస్ గా తీసుకున్న  చిత్ర బృందం   సినిమా  ఏ విధంగా వుండనుందో ఇటీవల  విడుదలైన   సాంగ్స్ ద్వారా  ఓ హింట్  ఇచ్చింది.  అందులో  భాగంగా ఇటీవల ఈ చిత్రం నుండి  రెండు సాంగ్స్ ను విడుదలచేశారు మేకర్స్.  అందులో మొదటి సాంగ్  సామజవరగమన  యూనానిమస్ పాజిటివ్  రెస్పాన్స్ ను  తెచ్చుకొని   ఈఏడాది సాంగ్ అఫ్ ది ఇయర్  గా నిలిచింది. అంతేకాదు  సౌత్ లో ఇప్పటివరకు అత్యధిక లైకులను  తెచ్చుకున్న సాంగ్ గా  ఈ సాంగ్ రికార్డు సృష్టించింది.  ఈ సాంగ్ తరువాత కొద్దీ రోజుల క్రితం ఈచిత్రం  నుండి  రాములో రాముల అనే సాంగ్ ను విడుదలచేయగా  ఈ సాంగ్ కూడా  అదే రెస్పాన్స్ తో  అత్యధిక లైకులను రాబట్టిన  రెండో తెలుగు సాంగ్ గా  రికార్డు సృష్టించింది. 



తాజాగా   ఈ చిత్రం నుండి   సీనియర్ నటి టబు  పుట్టిన  రోజు సందర్భంగా  నిన్నవిడుదలైన  ఆమె ఫస్ట్ లుక్ కు   కూడా  సూపర్ రెస్పాన్స్ వస్తుంది.  అలా  ప్రమోషన్స్ తో సినిమా పై అంచనాలను పెంచేస్తూ   నెగిటివ్  ప్రచారం చేసిన  వారి నోర్లు మూయించింది  చిత్ర బృందం.  ఇక  ఈచిత్రంలో  టబు ఓ కీలక పాత్రలో  నటిస్తుంది.  ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో  బన్నీ కి జోడిగా పూజాహెగ్డే నటిస్తుండగా  జయరాం , మురళి శర్మ , నవదీప్ , సుశాంత్ , నివేత పేతురాజు  ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా  జనవరి 12న ఈ చిత్రం విడుదలకానుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: