విక్టరీ వెంకటేష్ టాలీవుడ్లో మంచి పేరు ఉంది. ఆయన్ని మిష్టర్ కూల్ అని కూడా అంటారు. ఆయన సినిమాలు కూడా ఎక్కువ సక్సెస్  రేట్  కలిగి ఉంటాయి. పైగా రెండు దశాబ్దాల క్రితం వెంకీ సినిమా కూడా ఇపుడు హాయిగా టీవీల్లో చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. అంటే అందులో కంటెంట్ అంత ఫ్రెష్ గా ఉంటూ ఎవ‌ర్ గ్రీన్ లా అలరిస్తుందన్నమాట. అదే ఇతర హీరోల పాత  సినిమాలు ఇపుడు  చూడాలంటే చికాకు పుడుతుంది.


పైగా వెంకీ ఓ హీరోగా ఎపుడూ డౌన్ టు ఎర్త్ అంటారు. మెగా ప్రొడ్యూసర్ రామానాయుడు కుమారుడుగా ఫీల్డ్ లో ఎంట్రీ ఇచ్చినా కూడా తాను ఒక పెద్ద స్టార్ అయినా కూడా వెంకీ ఎపుడూ తన యాటిట్యూడ్ చూపించలేదు అని చెబుతారు. ఇక వెంకీలో ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. ఆయన ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా అనలైజ్ చేస్తారు. దాంతో ఆయన్లో ఎపుడూ టెన్షన్ కనబడదు. మరి అటువంటిది వెంకీ  కిందా మీద పడడమా. అదీ సినిమాల విషయంలోనా అన్న డౌట్లు రావచ్చు.


నిజానికి అది వెంకీ విష‌యంలో కాదు, ఆయన చేసిన వెంకీ మామ మూవీ విషయంలో.  ఈ మూవీ రిలీజ్ విషయంలో ఇపుడు చిత్ర యూనిట్ తెగ టెన్షన్ పడుతున్నారుట. ఈ సినిమా కంప్లీట్ అయింది. పైగా నిజ జీవితంలో మామా అల్లుళ్ళుగా ఉన్న వెంకీ, నాగ చైతన్య కలసి నటించిన మూవీ ఇది. హైప్ కూడా బాగుంది. ఈ సినిమా విషయంలో చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు కానీ ఎపుడు రిలీజ్ అంటే చెప్పలేకపోతున్నారు.


మొదట సంక్రాంతి అనుకున్నారు. ఆ తరువాత డిసెంబర్ అనుకున్నారు. అయితే అనూహ్యంగా డిసెంబర్లో బాలయ్య రూలర్, ర‌వితేజా మూవీ, అలాగే మెగా మెనల్లుడు మూవీ కూడా రిలీజ్ కి రెడీ అయిపోయాయి. దీంతో డిసెంబర్లో ఎపుడు రిలీజ్ అన్నది తెలియడంలేదుట. మంచి రోజు చూసుకుని సోలోగానే వెంకీ మూవీని థియేటర్లకు తీసుకువచ్చే ప్లాన్ చేస్తున్నారుట.



మరింత సమాచారం తెలుసుకోండి: