తెలుగు చలన చిత్ర సీమ విచిత్ర సీమ. ఇక్కడ టాలెంట్ ఒక్కటి ఉంటే సరిపోదు, దానితో పాటే కాస్తంత అద్రుష్టం కూడా ఉండాలి.  కడివెడు టాలెంట్ ఉన్న చిటికెట్ లక్కు కూడా లేని వారు మాత్రం దారుణంగా బ్యాక్ బెంచీల్లోకి వెళ్ళిపోయారు. ఇక లక్కుని తొక్కి వచ్చిన వారు ఎక్కడికో వెళ్ళిపోయారు. మొత్తానికి చూసుకుంటే లక్కు ఇంత పని చేస్తుందా అనిపించకమానదు. ఇపుడు ఓ టాలెంటెడ్ గాయకుడి గురించి ఫ్లాష్ బ్యాక్ తలచుకుంటే అయ్యో పాపం అనిపిస్తుంది.


ఆయనే జి ఆనంద్. అద్భుతమైన గాయకుడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆనంద్  అప్పట్లో కాలేజీ రోజుల్లోనే  ఘంటసాల , బాలు పాటలు పాడుతూ ఎన్నో పోటీల్లో పాలుపంచుకున్నారు. అలా ఓసారి ఎస్పీబీ, మ్యూజిక్ డైరెక్టర్ కేవీ మహదేవన్ డిస్కవరీగా పోటీలో గెలిచి  సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆయన మొదటి సినిమా సూపర్ స్టార్ క్రిష్ణ సొంత సినిమా పండంటి కాపురం. 1973లో విడుదల అయిన ఈ సినిమాలో తొలిసారి రాజబాబుకు గొంతు అరువిచ్చిన  ఆనంద్ సినీ సీమలో తన పేరు కూడా చూసుకున్నారు. ఆయన్ని పరిచయం చేసింద్ ద గ్రేట్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పీ కోందండపాణి. ఆ సినిమాలో అన్ని పాటలు ఘంటసాల, బాలు పాడారు. అయితే ఆనంద్ తొలి సాంగ్ బాలుతో కలిపి పాడారు.


ఇదిలా ఉండగా అప్పటికి తెలుగులో టాప్ హీరోలుగా అన్న నందమూరి, అక్కినేని, క్రిష్ణ, శోభన్ బాబు  ఉన్నారు. వీరిలో ఎవరికీ ఆనంద్  ఒక్క పాట కూడా పాడలేకపోయారు. ఆయన మురళీ మోహన్, చంద్రమోహన్ లాంటి వారికే పాడారు.  దానికి టాలెంట్ కంటే లక్కే చిక్కులు తెచ్చిపెట్టిందనుకోవాలి. అయితే అక్కినేనికి పాడే అవకాశం ఆనంద్ కి అలా ఒకసారి వచ్చింది. అది 1982 ఇయర్.  విక్టరీ మధుసూదనరావు డైరెక్ట్ చేసిన బంగారు కానుక మూవీలో ప్రేమ బ్రుందావనం అన్న మెలోడీ సాంగ్ ని సుశీలతో కలిసి ఆనంద్ పాడారు.  ఇక ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ సత్యం.ఈ పాట రేడియోలో అప్పటికే సూపర్ హిట్ గా నిలిచింది. చెప్పాలంటే ఆ మూవీలో సాంగ్ అన్నింటిలో ఈ సాంగ్ పెద్ద హిట్.  ఈ పాట అక్కినేని, సుజాతల  మీద తీయాల్సివుంది


అయితే ఆఖర్లో ఏం జరిగిందో ఏమో రికార్డులో ఉన్న ఆ పాట సినిమాలో మాత్రం లేదు. ఆ ప్లేస్ లో బాలు సుశీల పాడిన మరో సాంగ్ ని పిక్చరైజ్ చేశారు. మరి ఆనంద్ పాట అలా రేడియోలోనే లలిత గీతంగా మిగిలిపోయింది. అప్పటికి అక్కినేని టాప్ స్టార్. ఆ మూవీలో సాంగ్ కనుక ఆనంద్ ది  ఉండి ఉంటే ఆయన జాతకం తిరిగి ఎక్కడికో వెళ్ళిపోయేవారు. అదే వూపులో టాప్ స్టార్స్ అందరికీ కూడా పాడి టాప్ లెవెల్ సింగర్ గా కూడా నిలిచేవారు.  కానీ అది ఆయన బ్యాడ్ లక్ అంతే.


మరింత సమాచారం తెలుసుకోండి: