తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ అప్పట్లో ఓ సెన్సేషన్ సృష్టించింది. పి.వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతున్న నయనతార తొలిపరిచయం అయ్యింది.  ఈ మూవీలో చాలా సాంప్రదాయంగా కాస్త నత్తి మాట్లాడుతూ తమిళ, తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది.  ఆ తర్వాత సూర్య హీరోగా నటించిన ‘గజిని’ మూవీలో తన అందాలతో పిచ్చెక్కించింది.  కెరీర్ బిగినింగ్ లో వచ్చిన ప్రతీ పాత్ర చేసుకుంటూ తనను తాను నిరూపించుకుంటూ వచ్చింది. ఓ వైపు నటనకు ప్రాధాన్యత ఇస్తూనే గ్లామర్ షో చేస్తూ  సూపర్ స్టార్ రేంజ్‌కు చేరుకుంది.


ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. అంతే కాదు దక్షిణాదిన హీరోయిన్లలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది నయనతార. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన ఇన్నేళ్ల కెరీర్ లో అతి చెత్త మూవీ గురించి ప్రస్తావించింది.  మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘గజిని’  తాను వేసిన  క్యారెక్టర్ గురించి చెప్పుకుంటూ కాస్త ఘాటుగానే స్పందించింది. మొదట కథ చెప్పినప్పుడు తన పాత్ర బాగానే అనిపించిందని, కానీ తీరా సినిమా చూస్తే ఇంకోలా కనిపించిందని కామెంట్ చేసింది. అదే తన కెరీర్ మొత్తంలో చెత్త పాత్ర అని గతాన్ని గుర్తు చేసుకుంది. అయితే అంతలా కెరీర్ కి యూ టర్న్ ఇచ్చిన సినిమాపై నయన్ ఎవరు ఊహించలేదు.


మొదట తాను హీరోయిన్ స్థాయిలో చూపిస్తారని అనుకుంటే..మేకింగ్ అనంతరం సెకండ్ హీరోయిన్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చిందని వాపోయింది.  ఆ సినిమా సక్సెస్ ఇచ్చినప్పటికి నయన్ ఎందుకలా కామెంట్ చేసిందో ఎవరికి అర్థం కాలేదు. నయన్ కామెంట్స్ కి సూర్య అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గజిని మూవీ తర్వాత  ఏఆర్ మురుగదాస్‌తో ఇన్నేళ్లకు దర్భార్ మూవీలో మళ్లీ నటిస్తుంది.  చంద్రముఖి తర్వాత సూపర్ స్టార్ రజినీ సరసన నటిస్తుంది నయనతార. ఏది ఏమైనా  నయన్ కామెంట్స్ కి సూర్య అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: