రెండేళ్ల క్రితం వ‌ర‌కు టాలీవుడ్‌ సెన్సేషనల్‌ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలు వ‌రుస‌గా హిట్లు అవ్వ‌డంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకుపోయాయి. ఎప్పుడైతే నోటా, డియర్ కామ్రేడ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్ట‌ర్ అయ్యాయో అప్పుడే మ‌నోడి మార్కెట్ డౌన్ అయిపోయింది. ఇక తాజాగా విజ‌య్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన మీకు మాత్రమే చెప్తా సినిమా కూడా అదే దారి పట్టడంతో హీరో విజయ్ దేవరకొండ పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది.


ఈ సినిమాతో మ‌నోడు నిర్మాత‌గా కూడా ఫెయిల్ అయిన‌ట్ల‌య్యింది. ఇక వ‌చ్చే సినిమాతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విజ‌య్ హిట్ కొట్టాల్సి ఉంది. లేక‌పోతే మ‌నోడి ప‌రిస్థితి రాజ్‌త‌రుణ్ మాదిరిగా మారిపోతుంద‌న‌డంలో సందేహం లేదు. విజ‌య్ ముందు నుంచి కొత్త ద‌ర్శ‌కుల‌ను న‌మ్ముకునే సినిమాలు చేస్తున్నాడు. అయితే అవి హిట్ అవ్వ‌డ‌మో లేదా ఫ‌ట్ అవ్వ‌డ‌మో జ‌రుగుతోంది.


ప్ర‌స్తుతం విజ‌య్ సినిమాలు చూస్తే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు పని చేస్తున్నది క్రాంతి మాధవ్. ఇప్పటికే రెండు సినిమాలు అందించిన డైరక్టర్. ఇక ఫైట‌ర్ సినిమాకు పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ట‌ర్‌. మధ్యలో చేయాల్సిన హీరో సినిమాకే కొత్త దర్శకుడు పని చేస్తున్నారు. ఇక శివ నిర్వాణ‌కు కూడా కొత్త పేరు విన‌ప‌డుతోంది.


కొత్త ద‌ర్శ‌కులతో సినిమాలు చేయ‌డం.... అటు క‌థ‌ల ఎంపిక‌లో వేస్తోన్న రాంగ్ స్టెప్ప్‌లు, సినిమా బ‌డ్జెట్ కూడా పెంచుకుంటూ పోతుండ‌డంతో ఆ బ‌డ్జెట్‌కు త‌గిన‌ట్టుగా ఎక్కువ రేట్ల‌కు అమ్మ‌డం, సినిమా ప్లాప్ అయితే వ‌సూళ్లు రాక ఇలా అనేక ఇబ్బందుల్లో విజ‌య్ ఇరుక్కుపోతున్నాడు. ఈ క్ర‌మంలోనే ట్రేడ్ వ‌ర్గాల్లో విజ‌య్ సినిమాపై కాస్త క్రేజ్ తగ్గుతోంది. నెక్ట్స్ సినిమాల విష‌యంలో అయినా విజ‌య్ ఈ పొర‌పాట్లు పున‌రావృతం కాకుండా చూసుకుంటాడేమో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: