జయప్రద 1962 ఏప్రిల్ 3 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబములో కృష్ణ మరియు నీలవేణి దంపతులకు జన్మించింది. జయప్రద నటించిన చిత్రాలలో ముఖ్యమైనవి అంతులేని కథ, సిరిసిరిమువ్వ, అడవిరాముడు, యమగోల, సర్కస్ రాముడు, అగ్నిపూలు స్వయంవరం, దేవత, సాగరసంగమం, మేఘసందేశము ,ఈ చిత్రాలు ఆమెకు ఎనలేని కీర్తిని దక్కించుకుంది.


జయప్రదనందమూరి తారక రామారావు ఆహ్వానముతో 1994 అక్టోబర్ 10 న తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయరంగ ప్రవేశము చేసింది. ఆ తర్వాత ఈమె చంద్రబాబు నాయుడు పక్షములో చేరి తెలుగు దేశము పార్టీ యొక్క మహిళా విభాగమునకు అధ్యక్షురాలైనది. 1996 ఏప్రిల్ లో తెలుగుదేశము పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైనది. ఆ తరువాత పార్టీ నాయకులతో వచ్చిన గొడవల వలన తెలుగు దేశము పార్టీకి రాజీనామా చేసి జయప్రద ములాయం సింగ్ యాదవ్ యొక్క సమాజ్‌వాదీ పార్టీలో చేరి ఆంధ్ర నా జన్మ భూమి కానీ ఉత్తర ప్రదేశ్ నా కర్మభూమి అన్న నినాదముతో ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నియోజవర్గము నుండి 2004 మే 13 న లోక్ సభకు ఎన్నిక అవ్వడం జరిగింది.


 కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారు. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 2019, మార్చి 25వ తేదీ సాయంత్రం లేదా 26వ తేదీ అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తోన్నాయి.


జయప్రద తనను అవమానించిన ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ పార్లమెంటు ఎంపీఅజాంఖాన్‌‌కు తగిన శాస్తి జరిగిందని బీజేపీ నేత నటి జయప్రద అన్నారు. రాంపూర్‌ పార్లమెంట్ ఎన్నికల్లో ఆజాంఖాన్, మరియు జయప్రద ప్రత్యర్థులుగా ఉన్న నేపథ్యంలోనే ఆజాంఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు జయప్రద గతంలో బహిరంగానే కంటతడి పెట్టింది. దీంతో తనను ఏడిపించిన ఆజాంఖాన్‌కు ఇదే పరిస్థితి రావడంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఎన్నికల్లో తనను ఏడిపించినందుకే ఆజాంఖాన్‌ కూడ కేసుల్లో ఇరుక్కున్నారని వ్యాఖ్యానించింది. ఆయనకు మహిళల శాపం తగిలిందని జయప్రద పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: