దక్షిణాది భారత ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని భారతీయుడు. ప్రయోగాలు, విభిన్న పాత్రలకు ఆయనే నాయకుడు. తన యాక్టింగ్ తో ప్రేక్షకులకు దశావతారం చూపిస్తున్న లోకనాయకుడు కమల్ హాసన్. భారతదేశంలో పుట్టిన ఆస్కార్ స్థాయి నటుడు  కమల్ హాసన్ బర్త్ డే . వెండితెరపై విశ్వరూపం చూపిస్తున్న నట కమలం. కేవలం నటుడిగానే కాకుండా.. దర్శకుడిగా, నిర్మాతగా స్క్రీన్ ప్లే రైటర్ గా, కథకుడిగా వెండితెరపై చెరగని ముద్ర వేసిన బహుముఖ నటుడు.


 ఇప్పుడు 'మక్కల్ వీటి మయ్యమ్' అనే రాజకీయ పార్టీతో పాలిటిక్స్ లోకి అడుగు పెట్టాడు. ఆయనే ప్రముఖ నటుడు లివింగ్ జండ్ కమల్ హాసన్, ఆయన బర్త్ డే సందర్భంగా  మరోచరిత్ర', 'స్వాతిముత్యం', 'సాగర సంగమం', 'ఇంద్రుడు చంద్రుడు', 'శుభ సంకల్పం... తెలుగులో ఆయన చేసిన కొన్ని ఆణిముత్యాల్లాంటి సినిమాలలో నటించి మంచి ఆదరణ లభించుకున్నాడు. ఇవి చాలు.. నటుడిగా ఆయన స్టామినా ఏమిటో చెప్పడానికి, కలత్తూర్ కన్నమ్మ' అనే సినిమాతో బాలనటుడిగా ప్రారంభమైన కమల్ సినీ ప్రస్థానం....నేటికీ   అద్భుతంగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూనే.. త్వరలో శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు 2' మూవీతో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.


బాల నటుడి నుంచి యూనివర్సల్ హీరోగా కమల్ హాసన్ ప్రస్థానం కొనసాగుతుంది. బాలనటుడిగా శివాజీ గణేశన్, ఎంజీ రామచంద్రన్ వంటి తమిళ అగ్రనటులతో కలసి సినిమా తీసాడు. యవ్వనంలో డాన్స్ డైరెక్టర్ కమ్ ఫైటర్ గా కూడా చేసాడు అంటే నమ్మండి. 


తర్వాత భాషావేధం పాటించకుండా నటుడిగా వచ్చిన అవకాశాలు వదులుకోకుండా నటించాడు. అందులో భాగంగా.. ఆరేడు సినిమాలు యాక్ట్ చేసాడు. వాటిలో 1974లో మలయాళంలో వచ్చిన 'కన్యాకుమారీ' కమల్ ను సక్సెస్ ఫుల్ హీరోను చేసింది. 1977లో వచ్చిన 'పదనారు వయదినిలే' కమల్ హాసన్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఆ తర్వాత కమల్ వెనుదిరిగి చూసుకోలేదు. అప్పటి వరకూ తమిళ, మలయాళ భాషలకు మాత్రమే పరిచయమైన కమల్ నట విన్యాసం, తెలుగు వారికి సైతం మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: