మహేష్ బాబు క్రిష్ణ కుమారుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 1999 లో ఆయన తొలి సినిమా రిలీజ్ అయింది. ఇప్పటికి రెండు దశాబ్దాల క్రితం ఆయన స్టార్ అయ్యాడన్న మాట. ఈ ఇరవయ్యేళ్ళలో మహేష్ బాబు నటించిన సినిమాలు పాతిక వరకూ ఉంటాయి. ఇందుకో హిట్లూ, సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్లు పడ్డాయి. అయితే మహేష్ వయసు నాలుగున్న పదులు దాటినా కూడా ఆయన అందం మాత్రం చెక్కుచెదరలేదు. మహేష్ హ్యాండ్సమ్  ఫిగర్ చూసి హీరోయిన్లే కన్ను కుట్టుకుంటారు.


ఇక మహేష్ లెక్కా పక్కాగా ఉంటుంది. ఆయన చాలా క్లారిటీగా ఉంటారని అంటారు. చేసిన సినిమాలు, చేయబోయే సినిమాలు, టాలీవుడ్ రేంజి ఏంటి, తన పొజిషన్ ఇవన్నీ కూడా మహేష్ కి కచ్చితమైన అంచనాలు ఉన్నాయి. అందువల్లనే ఆయన క్రిష్ణకు భిన్నంగా  సాగుతారని చెబుతారు. నిర్మాతకు కూడా నాలుగు డబ్బులు రావాలి. అదే సమయంలో తాను ఏ మాత్రం నష్టపోకూడదు ఇదీ మహేష్ థియరీ అంటారు.


ఇక మహేష్ మొదట్లో ఏడాదికి రెండు సినిమాలు, మూడు కూడా చేశారు. ఆ తరువాత మధ్యలో మాత్రం రెండేళ్ళకు ఒక సినిమా చేస్తూ పోయారు. దీంతో ఫ్యాన్స్ చాలా  ఎక్కువగా వెయిట్ చేస్తూ వచ్చారు. దాంతో మహేష్ బాబు ఏడాది రెండు సినిమాలు అంటూ హామీ అయితే ఇచ్చాడు కానీ ఆచరణలో అది కుదరడంలేదు. ఈ ఏడాది కూడా మహేష్ మహర్షి మూవీతో సరిపెట్టేశారు. గత ఏడాది అంతే భరత్ అను నేను ఒక్కటే సినిమా వచ్చింది.


అయితే 2020 లో మాత్రం మహేష్ కచ్చితంగా రెండు సినిమాలతో వస్తాడట. జనవరి వస్తూనే సరిలేరు నీకెవ్వరూ మూవీతో పలకరించే మహేష్ దసరా నాటికైనా మరో మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నాడుట. దానికి డైరెక్టర్లు ఎవరు అన్నదే ఇపుడు చర్చ,  కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ తోనా, లేక వంశీతోనా అన్నది తెలియన‌ప్పటికీ మహేష్ మాత్రం కొత్త ఏడాది తన ఫ్యాన్స్ కు  రెండు మూవీస్ తో సర్ప్రైజ్ మాత్రం ఇస్తాడట‌. చూద్దాం.



మరింత సమాచారం తెలుసుకోండి: