టాలీవుడ్ హీరోల్లో  ఆరడుగుల అందగాడు అమ్మాయిల కలల రాకుమారుడి ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. బాల నటుడిగానే తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన మహేష్ బాబు... బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక ఆ తర్వాత టాలీవుడ్ హీరోగా మారిపోయిన ప్రిన్స్ మహేష్ బాబు... అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ అభిమానులు సూపర్ స్టార్ గా మారిపోయారు. అయితే సూపర్ స్టార్ కి మహేష్ కి  అటు  అబ్బాయిల్లోనే ఓ సూపర్ క్రేజ్ ఉంటే... ఇక  అమ్మాయిల్లో  క్రేజ్ గురుంచి చెప్పాల్సిన పనిలేదు .మహేష్ మహేష్ అంటూ జపం చేస్తుంటారు. ఇక  మహేష్ బాబు ఏజ్ పెరుగుతున్న కొద్దీ రోజు రోజుకి యంగ్ గా  కనిపిస్తుంటారు మహేష్ బాబు. మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లతో బాక్సాఫీస్ ని షేక్ చేశారు. కెరీర్ మొదటి నుంచి భిన్నమైన కథలు ఎంచుకుంటూ ఎన్నో భారీ విజయలన్ని తన ఖాతాలో వేసుకున్నారు మహేష్ బాబు. 



 సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా టాలీవుడ్ హీరోగా ఏంట్రీ  ఇచ్చినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు ప్రిన్స్ మహేష్ బాబు. అంతే కాకుండా తాజాగా వెల్లడైన సర్వేల్లో కూడా టాలీవుడ్ లో నంబర్ 1 హీరోగా కొనసాగుతున్నారు మహేష్ బాబు. శ్రీమంతుడు సినిమాలో ఒక బాధ్యతగల పౌరుడిగా... భరత్ అనే నేను లో ఒక డైనమిక్ సీఎం గా... ఇక తాజాగా మహర్షి సినిమాలో ఒక మంచి ఫ్రెండ్ గా ఇలా విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ వరుస విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు మహేష్ బాబు . మహేష్ బాబు నటన ల్లో  ఒక సపరేట్ స్టైల్ కనిపిస్తుంటుంది. ఆ స్టైల్  అభిమానులను తెగ ఆకర్షిస్తూ వుంటుంది. 




 ఇక తాజాగా సరిలేరు నీకెవ్వరు తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమాలో మహేష్ బాబు కెరీర్ లోనే మొదటి సారి ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నారు మహేష్ బాబు. దీంతో ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అది వైరల్ ga మారిపోతుంది. అంతేకాకుండా ఈ సినిమాలో 13 ఏళ్ల తర్వాత అలనాటి అగ్రతార విజయశాంతి మరోసారి మేకప్ వేసుకుంటుంది. దీంతో ఈ సినిమాపై అంచన మరింత పెరిగిపోయింది. అంతేకాకుండా సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకేక్కిస్తున్నాడు. ఇలా ప్రతి విషయంలో ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేస్తుంది. ఇక మహేష్ అభిమానులను ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ బాబు  బాక్సాఫీస్ ని ఎలా షేక్  చేస్తాడో చూడాలి మరి .


మరింత సమాచారం తెలుసుకోండి: