ప్రభాస్ టాలీవుడ్లో టాప్ రేటింగ్ హీరో. టాలీవుడ్లో మాత్రమే కాదు.. ఇండియా వైడ్ గా ప్రభాస్ కు ఇప్పుడు మంచి మార్కెట్ ఉన్నది.  ప్రభాస్ సినిమా అంటే పాన్ ఇండియా మూవీగా తీయాల్సిందే.  బాహుబలి తరువాత ప్రభాస్ కు మార్కెట్ పెరిగిపోయింది.  ప్లాప్ అయినా సాహో సినిమా రూ. 450 కోట్లు వరకు సాధించింది అంటే అర్ధం చేసుకోవచ్చు.  ప్రభాస్ కు ఏ స్థాయిలో మార్కెట్ ఉన్నదో.  ముఖ్యంగా బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.  


సుజిత్ బీహార్లో పుట్టి ఉంటె ఆయనకు గుడి కట్టేవారు అని అక్కడి ప్రేక్షకులు అన్నారంటే వారిని ఈ సినిమా ఏ మేరకు ప్రభావితం చేసిందో అర్ధం చేసుకోవచ్చు.  అయితే, తెలుగు, ఇతర దక్షిణాది భాషల్లో ఈ మూవీ బెడిసికొట్టింది.  ఇదే సినిమాకు మైనస్ పాయింట్.  సినిమా విషయంలో చేసిన కొన్ని తప్పిదాలే సినిమా ఫెయిల్యూర్ కు కారణం అయ్యాయి.  బాహుబలి మార్కెట్ ఇంకా ప్రభాస్ పై ఉండటంతో సాహో సినిమాకు కలిసి వచ్చింది.  


ప్రస్తుతం ప్రభాస్ జాన్ వర్కింగ్ టైటిల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఇది ప్యూర్ లవ్ స్టోరీ.  పీరియాడికల్ స్టోరీగా తెరకెక్కుతోంది.  1980 నాటి లవ్ స్టోరీతో సినిమాను తీస్తున్నారు.  ఎక్కువ భాగం యూరప్ బ్యాక్ గ్రౌండ్ తో సినిమా నడుస్తుంది.  1980 కాలంలో యూరప్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయో దానికి తగ్గట్టుగా వాతవరణ పరిస్థితులను కల్పించి సినిమా తీస్తున్నారు.  ఇప్పటికే యూరప్ లో కొంత షూటింగ్ పూర్తి చేశారు.  


రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేక సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు.  దాదాపుగా సినిమా 70శాతం వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది.  ట్రైన్ సెట్ వేసి అందులో పదిరోజులపాటు షూట్ చేయబోతున్నారు.  ఈ పదిరోజుల పాటు షూటింగ్ చేసిన తరువాత యూరప్ లో అందమైన లొకేషన్స్ లో సాంగ్స్ షూట్ చేయబోతున్నారు.  ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా, రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.  గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: