బిగ్ బాస్ అయిపోయి నాలుగు రోజులు పూర్తి కావొస్తున్న సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే అంతా అనుకున్నట్టు
శ్రీముఖి గనక
విన్నర్ అయి ఉంటే ఈ రేంజ్ లో వార్తలు రాసే వాళ్ళు కాదేమో! బయట అంతగా ఫేమ్ లేని
రాహుల్ విన్నర్ అవడంతో ఇది మరింత ఎక్కువైంది. అయితే శ్రీముఖికి
బిగ్ బాస్ సీజన్ లో అందరి కంటే ఎక్కువ పారితోషికం వచ్చిందనే వార్త వైరల్ అవుతుంది.
దీంతో అసలు టైటిల్
విన్నర్ అయిన
రాహుల్ కి ఎంత వచ్చిందనే ప్రశ్న మొదలైంది. టైటిల్ గెలిచినందుకు యాభై లక్షలతో పాటు అన్ని రోజులు
హౌస్ లో ఉన్నందుకు పారితోషికం కూడా ఇచ్చారు. అయితే అవన్నీ కలుపుకుని
రాహుల్ కి బాగానే చేరిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో
రాహుల్ ఒకానొక ఇంటర్వ్యూలో తన పారితోషికం గురించి స్పందించాడు. అయితే అందరూ అనుకున్నట్టుగా తనకి అంత పారితోషికం రాలేదని, చాలా తక్కువే వచ్చిందని చెప్పాడు.
రాహుల్ ఎంత వచ్చిందో ఫిగర్ చెప్పకపోయినప్పటికీ ఒక హింట్ మాత్రం ఇచ్చాడు. ఆ హింట్ ప్రకారం
రాహుల్ కి వారానికి లక్ష చొప్పున పారితోషికంగా ఇచ్చారట. అంటే మొత్తం పదిహేను వారాలకి గాను
రాహుల్ కి పదిహేను లక్షలు వచ్చిందని తెలుస్తుంది. ఇక టైటిల్ గెలిచినందుకు యాభై లక్షలు కలుపుకుంటే అరవై ఐదు లక్షలు వచ్చినట్టుగా ఉంది. అయితే ఆ మొత్తం అతనికి చేరలేదు.
టాక్స్ లు,జీఎస్టీ లాంటివన్నీ తీసేయగా
రాహుల్ కి నలభై ఐదు లక్షలు వచ్చిందని సమాచారం. ఈ డబ్బులతో
రాహుల్ సొంత ఫ్లాట్ కొంటాడని చెప్పిన విషయం తెలిసిందే. అలాగే సొంత సెలూన్ ని కూడా ఏర్పాటు చేసుకుంటాడట. మొత్తానికి
రాహుల్ కి
బిగ్ బాస్ ద్వారా చాలా ఫేమ్ వచ్చింది.