టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్... మాటల రచయిత టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన త్రివిక్రమ్... తర్వాత తర్వాత దర్శకుడిగా మారిపోయాడు. అయితే త్రివిక్రమ్ మాటల గురించి అయితే కొత్తగా చెప్పాల్సిన పనిలేదు... సినిమాల్లో  ఆయన రాసిన డైలాగ్ లతో సగటు సినీ  ప్రేక్షకున్ని  మాయ చేసేస్తుంటాడు  త్రివిక్రమ్. ఇక పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని దర్శకుడు త్రివిక్రమ్. నాకిష్టమైన స్నేహితుడు... నేను దాచుకున్న నా సైన్యం... నేను శత్రువు మీద చేసే యుద్ధం... నేను ఎక్కుపెట్టిన బాణం... నా పిడికిట్లో ఉన్న వజ్రాయుధం... నా ఉప్పెన అంటూ తనకు పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని తూటాల్లాంటి  మాటల రూపంలో చెప్పడం అది ఒక్క త్రివిక్రముడుకే సాధ్యం. ఇలాంటి డైలాగ్స్ ని కూడా సినిమాల్లో వాడొచ్చా అని అందరి దర్శకులను మేల్కొలిపి  టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్ చేసిన గొప్ప దర్శకుడు త్రివిక్రమ్. 



 పేజీలకు పేజీలు డైలాగులు అవసరం లేదు... మాయ చేసే మాటలతో అందరినీ అలరించే కొన్ని పంచింగ్ డైలాగ్స్ ఉంటే చాలు అని  త్రివిక్రమ్ నిరూపించాడు. అందుకే త్రివిక్రమ్ ని మాటల మాంత్రికుడు అని పిలుస్తుంటారు. ఇక సినిమా థియేటర్ కు  వెళ్ళిన ప్రతి ప్రేక్షకుడికి త్రివిక్రమ్ సినిమాల్లో  డైలాగులు  మత్తుగా గమ్మత్తుగా అనిపిస్తుంటాయి . త్రివిక్రమ్సినిమా చూసిన ఆయన మాటల గారడీ మాటల్లో చెప్పలేనిది... సినిమాకి వెళ్ళిన సగటు ప్రేక్షకుడిని ఎక్కడా బోర్ కొట్టకుండా తన డైలాగ్ లతో హాయిగా  సినిమా చూసేలా  చేస్తుంటాడు త్రివిక్రమ్. ఇక త్రివిక్రమ్ సినిమా అంటే పంచింగ్ డైలాగులు అభిమానులు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో  అరవింద సమేత సినిమా తీసి తూటాలాంటి  డైలాగులతో తెలుగు ప్రేక్షకులందరినీ మెస్మరైజ్ చేశాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. 



 యుద్ధం చేసే దమ్ములేనోడికి... యుద్దాన్ని ఆపే అర్హత లేదు... అంటూ అరవింద సమేత సినిమాలో త్రివిక్రమ్ రాసిన ప్రతి డైలాగ్ ప్రేక్షకులను హోరెత్తించింది. త్రివిక్రముడి  ప్రతి ఒక్క డైలాగ్ టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది . తన డైలాగుతో నే సినిమాను చూస్తున్న ఆడియన్స్ ని  కన్విన్స్  చేయగల సత్తా దర్శకుడు త్రివిక్రమ్ కే సాధ్యం. హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా తనదైన స్టయిల్లో సినిమా తీస్తాడు మాటల మాంత్రికుడు . ఇక తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో  సినిమాతో ఓ  ఎమోషనల్ డ్రామా  తెరకెక్కిస్తున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఇలా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరెన్నో రోజులు సినీ ప్రేక్షకులను తన మాటలతో మాయ చేసి సినిమాలతో అలరించాలని  కోరుకుంటూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు జన్మదిన శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి: