సినిమా ప్రపంచంలో బాధలు చూపిస్తారు..వైభోగాలు చూపిస్తారు.  తెరపై లేనిది ఉన్నట్లు..ఉన్నది లేనట్లు కొత్త ప్రపంచాన్నే చూపిస్తారు. అయితే నటీ, నటులు ఎన్నో రకాల పాత్రల్లో కనిపిస్తుంటారు...ఆ పాత్రలకు జీవం పోస్తుంటారు.  భారతీయ సినీ పరిశ్రమలో ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించిన విశ్వనటుడు కమల్ హాసన్ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆరు పదుల వయసు దాటినా.. ఇప్పటికీ నటనలో కొత్త ప్రయోగాలు చేయాలని తపిస్తుంటారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ మూవీ సీక్వెల్ ఇండియన్ 2 లో నటిస్తున్నారు. 

ఈ మూవీలో సేపాపతి అనే వృద్దుడి పాత్రలో నటిస్తున్నారు కమల్. ఇక కమల్-దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కాంబినేషలో ఎవర్ గ్రీన్ మూవీస్ వచ్చాయి.  చలన చిత్ర రంగంలో ఆ మూవీ ఎప్పటికీ మర్చిపోలేని విధంగా విజయం సాధించాయి.  ‘అమావాస్య చంద్రుడు’, ‘పుష్పకవిమానం’ ‘విచిత్ర సోదరులు’ ఈ మూవీ సినిమాలు మూడు విభిన్నమైన కథలతో తెరకెక్కాయి. పుష్పకవిమానం అయితే పూర్తిగా మూకీగా (మాటలు ఉండవు) తెరకెక్కించారు. విచిత్ర సోదరులో ఓ పాత్ర మరుగుజ్జుగా కనిపిస్తుంది.  గతంలో సింగీతం శ్రీనివాసరావు విచిత్ర సోదరులు మూవీలో అప్పు (మరుగుజ్జు) పాత్ర అద్భుతం..అనిర్వచనీయం.  అలాంటి ప్రయోగం ఇప్పటి వరకు సినీ పరిశ్రమలో ఎవరూ చేయలేదనే చెప్పొచ్చు.

అసలు కమల్‌హాసన్‌ను అలా ఎలా చూపించారో ఇప్పటికీ చాలామందికి పెద్ద ప్రశ్నే.  మాకు అత్యంత కష్టమైన పని కమల్‌ను పొట్టివాడిగా చూపించడం.  ఈ రోజుల్లో అంటే టెక్నాలజీ పెరిగింది..ఎలాంటి అద్భుత దృశ్యమైనా గ్రాఫిక్స్ లో చూపించొచ్చు కానీ, అప్పట్లో అలాంటివేవీ లేవు...అయినా కమల్ పడ్డ కష్టంతో ఆ పాత్ర అద్భుతంగా వచ్చింది.  స్క్రీన్‌పై కమల్‌ పొట్టివాడిగా కనిపించేందుకు ఆయన మోకాళ్లు పట్టేలా, వెనుకవైపు ఓపెన్‌ ఉండేలా 18 అంగుళాల తేలికపాటి షూను ప్రత్యేకంగా తయారు చేయించి వాటిని తొడిగాం. 


కొన్నీ సీన్లు నేలమీద కమల్‌ కాళ్లను భూమిలోపల పాతిపెట్టే వాళ్లం.  కొన్ని క్లోజప్ షాట్స్..చాలా వరకు లాంగ్ షాట్స్ తోనే పనికానిచ్చాము. అయితే కమల్‌ ఎక్కడ, ఎప్పుడు ఎలా ఉండాలనే విషయాలన్నీ జపాన్‌ అనే సెట్‌ బాయ్‌ చూసుకునేవాడు.  కమల్‌ నడిచే సన్నివేశాల్లో కెమెరా ట్రిక్‌ను ఉపయోగించి తీశామని అన్నారు.  ‘బుజ్జి పెళ్లి కొడుక్కి రాజయోగమురా’ అనే పాటలో కమల్‌ కాళ్లు ఊపే సన్నివేశం..అందుకోసం ప్రత్యేకంగా సోఫాను తయారు చేయించి, దానిలోపలికి కమల్‌ దిగి నడుం వరకూ కనపడేలా కూర్చోబెట్టాం. మరికొన్ని సన్నివేశాలు కమల్‌ కష్టంతో పాటు, జపాన్‌ అనే వ్యక్తి సహకారం మర్చిపోలేనిది. మొత్తానికి ఈ మూవీ మేం అనుకన్నదానికన్నా ఎక్కవ సక్సెస్ అవ్వడమే కాదు ఎన్నో అవార్డులు కూడా తెచ్చిపెట్టిందని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: