నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం రాజకీయాలతో పాటు అటు  సినిమాల్లో కూడా తనదైన హవా నడిపిస్తున్నారు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు కథానాయకుడు సినిమాలు పరాజయం పాలవడంతో ప్రస్తుతం బాలకృష్ణ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో  తిరకెక్కుతున్న రూలర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే గత ఎన్నికల ముందు తన తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోతున్నది అనుకున్న  తరుణంలో... ఎన్నికల తర్వాత మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందంటూ అభిమానులకు సంకేతాలు ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. అయితే ఎలక్షన్లు  అయిపోయి ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు నందమూరి బాలకృష్ణ మోక్షజ్ఞ  ఏంట్రీ పై  మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వలేదు . 



 అయితే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అన్ని కుటుంబాల నుంచి ముగ్గురు కు పైగా వారసులు టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు. కానీ నందమూరి ఫ్యామిలీ నుంచి మాత్రం వారసుడు టాలీవుడ్ కి ఏంట్రీ ఇచ్చి  దాదాపు 13 ఏళ్ళు గడిచి పోతుంది. దీంతో నందమూరి ఫ్యామిలీ నుంచి ఓ కొత్త హీరో ఎంట్రీ కోసం అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ కొత్త హీరో నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ కావాలనుకుంటున్నారు అభిమానులు . ఇక అటు నందమూరి మోక్షజ్ఞ కూడా తండ్రికి తగ్గ తనయుడు తాతకు తగ్గ మనవడు అనిపించుకోవడానికి రెడీ గా ఉన్నాడు . ఇప్పటికే మోక్షజ్ఞ  23వ యేట అడుగుపెట్టాడు. 



 దీంతో నందమూరి అభిమానులు అందరూ మోక్షజ్ఞ  ఏంట్రీ ఎప్పుడు అని బాలకృష్ణ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా మోక్షజ్ఞకు  సినిమాలంటే ఆసక్తి లేదని బిజినెస్ వైపు అడుగులు చేస్తున్నాడంటూ ఈమధ్య  కొన్ని వార్తలకు  ప్రచారంలోకి వచ్చాయి. అయితే దీనిపై బాలయ్య అభిమానులకి సమాధానం ఇచ్చినట్లు సమాచారం. తన తనయుడు మోక్షజ్ఞని ప్రస్తుతం చదువు లతో బిజీగా ఉన్నాడు అని...  పూర్తయిన వెంటనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడు అని క్లారిటీ ఇచ్చారు  బాలకృష్ణ. కచ్చితంగా నటనలోకి వస్తారని బిజినెస్ లాంటివి ఏమీలేవని  బాలయ్య క్లారిటీ ఇచ్చారట. ఇదిలా ఉండగా అభిమానుల్లో మరో ప్రశ్న కూడా తలెత్తుతోంది. మోక్షజ్ఞ తాజాగా విడుదలైన ఫోటోలు చూస్తుంటే ఓవర్ వెయిట్ లో చాలా లావుగా ఉన్నాడు... దీంతో మోక్షజ్ఞ కు  సినిమాల పై ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే దానిపై కూడా అభిమానులు సందేహ పడుతున్నారు. బాలయ్య మాత్రం ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని మోక్షజ్ఞ కచ్చితంగా సినిమాల్లోకి వస్తాడని... కానీ అది ఇప్పట్లో కుదరదంటూ అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: