సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'దర్బార్' మోషన్ పోస్టర్ ఈ రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు విడుదలయింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజినీ అభిమానులందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. పైగా 'చంద్రముఖి' సినిమా తర్వాత రజనీకాంత్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార పూర్తిస్థాయిలో హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం కూడా ఇదే. కబాలి, కాలా మరియు పేటా లాంటి మాస్ సినిమాల తర్వాత తలైవర్ ను మురుగదాస్ ఎలా చూపించబోతున్నాడు అని అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ రోజు మోషన్ పోస్టర్ విడుదల చేసేందుకు మురుగదాస్ కమల్ హాసన్, సల్మాన్ ఖాన్, మోహన్ లాల్.... ఇలా ప్రతీ చిత్రసీమ నుండి ఒక్కొక్క ప్రముఖ వ్యక్తిని ట్యాగ్ చేస్తూ వచ్చారు. అంటే తమిళ వెర్షన్ కు సంబంధించిన పోస్టర్ ను కమల్ హాసన్ విడుదల చేయగా, మలయాళం వర్షన్ ను మోహన్ లాల్ మరియు హిందీ వెర్షన్ ను సల్మాన్ ఖాన్ విడుదల చేశారు. ఇంతకీ తెలుగు సంగతి ఏమిటి?

తెలుగు చిత్ర పరిశ్రమకు ముఖ చిత్రమైన మెగాస్టార్ చిరంజీవి ని కాదని మోషన్ పోస్టర్ ను విడుదల చేసే అవకాశం మహేష్ కు దక్కింది. అయితే ముందుగా మురుగదాస్ మహేష్ పేరును వెల్లడించకుండా గా దానిని సస్పెన్స్ గా ఉంచారు. రజిని కి బాగా మంచి మిత్రుడైన చిరంజీవి చేతనే మోషన్ పోస్టర్ లాంచ్ అవుతుంది అని అంతా అనుకున్నారు కానీ విడుదలకు కొద్ది గంటల ముందు మహేష్ బాబు పేరును మురుగదాస్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. చివరికి చాలా మంది తెలుగు అభిమానులు మరియు మెగా ఫ్యాన్స్ ఈ పనికి నొచ్చుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: