అందమైన కన్నె పిల్లకు అందం ఎక్కడ ఉంది. అంటే ఠక్కున జవాబు చెప్పలేరు ఎవరూ కూడా. ఎందుకంటే నఖ శిఖ పర్యంతం అందాలే అందాలు అంటారు రసిక ప్రియులు. అలనాటి పురాణాల నుంచి ఈనాటి సినీ కవుల గీతాల వరకూ చూసినా ఇక్కడ ఇదీ అందం అని చెప్పలేకపోయారుగా. అందమంతా గుమ్మరించి బ్రహ్మ చేసిన బొమ్మ అందాలా అడబొమ్మ అంటారే తప్ప మరేమీ వర్ణించలేరు కూడా.


ఇక సినీ తారల అందాలను కంప్లీట్ గా ఎక్స్ పోజ్   చేస్తూ వస్తున్నా కూడా అందం అలా పరవళ్ళు తొక్కుతూనే ఉంది. కెమెరా కళ్ళకు చిక్కకుండా తప్పించుకునే ఉంది. నాటి రాఘవేంద్రరావు నుంది నేటి వెంకీ కుడుమల వరకూ అందం కోసం బూతద్దాలే పెట్టుకుని మరీ వెతికేస్తున్నారు. ఇక విషయానికి వస్తే భీష్మ  టీజర్ లేటెస్ట్ గా విడుదల చేశారు. ఇందులో రొమాంటిక్ ఫీల్ వచ్చేలా రష్మిక నడుము అందాల వైపే కెమెరాను పరుగెత్తించారు.


హీరో భీష్ముడు కానీ రష్మిక వెంట పడుతున్నాడు. అదే ట్విస్ట్ ఏమో. ఇక రష్మిక నడుము అందాలను బాగానే ప్రెజెంట్ చేశారు. వాటిని పట్టుకోవడానికి అన్నట్లుగా నితీన్ రెండు చేతులూ సరిచేసుకుని వెనకాలే రావడం చివరికి ఆమెకు దొరికిపోవడం భలే తమాషా సీన్ టీజర్లో కనిపిస్తుంది. 


ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి కానీ నడుము అందం అంటే భూమికదేనంటారు ఇప్పటికీ రొమాంటిక్  ప్రియులు. ఖుషీ మూవీ వచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నా అందులో భూమిక నల్లటి చీరలో చూపించే తెల్లటి నడుము, పవన్ దొంగ చూపులు ఇవన్నీ ఎన్ని సార్లు టీవీలో ఆ సీన్ చూసినా ఎక్కడికో తీసుకుపోతాయని అంటారు. మరి రష్మిక నడుము అందాలను వెంకీ కుడుముల ఇంకెలా చూపిస్తాడో.


మరింత సమాచారం తెలుసుకోండి: