వరుస ప్లాపులతో డీలాపడిన రవితేజ ఈసారైన హిట్ కొట్టాలనే కసితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ సినిమా పేరే డిస్కోరాజా.. విఐ ఆనంద్ దర్శకత్వంలో, మాస్ మహారాజా రవితేజ హీరోగా, పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యాహోప్‌ కథానాయికలుగా, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రామ్‌ తాళ్లూరి, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఇకపోతే భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రంపై రవితేజతో పాటు ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టికున్నారు.


దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే విడుదలైన రవితేజ గ్రాఫిక్‌ పోస్టర్‌, బాబీ సింహ లుక్‌, లిరికల్‌ సాంగ్‌ సినీ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పటివరకు సినిమా విడుదలపై చిత్ర యూనిట్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోవడంతో రవితేజ అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. వారి నిరాశను పోగొట్టేలా చిత్ర యూనిట్‌ మాస్‌ మహారాజ్‌ అభిమానులకు తీపి కబురు చెప్పింది. అదేమంటే వచ్చే ఏడాది జనవరి 24న  ‘డిస్కో రాజా’  విడుదల కానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.


ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ఎస్‌ఆర్‌టీ తన అధికారిక ట్విటర్‌లో తెలిపింది. ఇకపోతే రవితేజ కూడా డేట్‌ గర్తుపెట్టుకోండి అంటూ రీట్వీట్‌ చేశాడు. ఇన్నిరోజులకు ఈ సినిమా విషయంలో ఓ క్లారీటీ వచ్చింది. ఇక గ్రాఫిక్స్‌కు అధిక ప్రాధాన్యత ఉన్న సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ మూవీ, అనుకున్న రీతిలో అవుట్‌పుట్‌ రాకపోవడంతో చిత్ర యూనిట్‌ పలుమార్లు సినిమా విడుదలను వాయిదా వేసింది.


ఈ సమయంలో వచ్చే వేసవి ప్రారంభంలో ఈ సినిమా విడుదల కావచ్చనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఖండిస్తూ ఇప్పుడు సినిమా విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. ఇకపోతే మొత్తానికి సంక్రాంతి దాటిన తర్వాత డిస్కోరాజాతో రవితేజ జనవరి 24న థియేటర్లలో సందడి చేయబోతున్నాడన్న మాట.. 


మరింత సమాచారం తెలుసుకోండి: