రజినీకాంత్  సినిమా అంటే సౌత్ వాళ్లకు పెద్ద పండుగే.  68 ఏళ్ళ వయసులో కూడా రజినీకాంత్ ఇంకా కుర్రాడిలా సినిమాలు చేస్తూ... వావ్ అనిపిస్తున్నాడు.  అయితే, గత కొంతకాలంగా రజినీకాంత్ చేస్తున్న సినిమాలు పెద్దగా క్లిక్ కావడం లేదు.  ఎదో ఒక కారణంతో ఫెయిల్ అవుతున్నాయి.  అయినా సరే రజినీకాంత్ పట్టువదలకుండా సినిమాలు చేస్తున్నాడు.  


ఈ ఏడాది జనవరిలో వచ్చిన పేట సినిమా మంచి విజయం సాధించింది.  అయితే, తెలుగులో పబ్లిసిటీ లేక సినిమాకు కలెక్షన్ రాలేదు.  ఇప్పుడు రజినీకాంత్ దర్బార్ సినిమా చేస్తున్నాడు.  మురుగదాస్ దర్శకుడు.  మురుగదాస్ దర్శకత్వంలో రజిని చేస్తున్న మొదటి సినిమా ఇది.  ఈ సినిమా కోసం యావత్ భారతీయ సినిమా ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.  వచ్చే ఏడాది జనవరి 10 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  


ఇదిలా ఉంటె, ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేశారు.  ఈ పోస్టర్ చూస్తుంటే.. నిజంగా రజినీకాంత్ కుర్రాడిలా ఉన్నాడు.  ఎమోషన్ పక్కా వర్కౌట్ అయినట్టు కనిపిస్తోంది.  దాదాపు 25 సంవత్సరాల క్రితం రజినీకాంత్ పోలీస్ ఆఫీస్ పాత్రలో నటించాడు.  మరలా ఇంతకాలం తరువాత పోలీస్ పాత్రలో రజినీకాంత్ కనిపిస్తున్నారు.  ఈ పాత్రలో రజినీకాంత్ ఎలా ఉంటాడో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  మోషన్ పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో.. సినిమా హిట్ అవుతుందని అంటున్నారు తమిళ విశ్లేషకులు. 


ఇందులో పవర్ ఫుల్ పోలీస్ గా రజిని కనిపిస్తున్నారు.  లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్.  అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.  పేట సినిమాకు కూడా అనిరుద్ మ్యూజిక్ అందించాడు.  ఆ సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే.  ఇప్పుడు మరలా రజిని దర్బార్ కు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.  లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ నెలలో రజినీకాంత్.. శివ కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: